News November 15, 2025
కోరుట్ల: గుండెపోటుతో యువకుడి మృతి

గుండెపోటు రావడంతో ఉన్నచోటే పలువురు కుప్పకూలి ప్రాణాలు విడుస్తున్న ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయి. శుక్రవారం కోరుట్ల పోచమ్మవాడకి చెందిన పిల్లి రాజు (34) అనే యువకుడు అర్ధరాత్రి బాత్రూం కోసం వెళ్ళి అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Similar News
News November 15, 2025
మక్తల్‌లో వచ్చే ఏడాది రాష్ట్ర స్థాయి అండర్–14 క్రికెట్ ఎంపికలు

మక్తల్ లో వచ్చే ఏడాది రాష్ట్ర స్థాయి అండర్–14 బాలుర క్రికెట్ ఎంపికలను నిర్వహించేందుకు క్రీడా శాఖ మంత్రి డా.వాకిటి శ్రీహరి ప్రత్యేకంగా ప్రోత్సాహం చూపుతున్నారని జిల్లా క్రీడా అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా స్థాయి అండర్-14 స్కూల్ గేమ్స్ క్రికెట్ ఎంపికలు మక్తల్ మినీ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. మొత్తం 80 మంది బాలురు వీరిలో 20 మందిని ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
News November 15, 2025
BREAKING: అల్పపీడనం.. భారీ వర్షాలు

AP: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరంలో అల్పపీడనం ఏర్పడిందని APSDMA వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించినట్లు తెలిపింది. ‘దీని ప్రభావంతో తీరం వెంట 35-55Kmph వేగంతో గాలులు వీస్తాయి. సోమవారం నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు, ప్రకాశం, కడప జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదు’ అని సూచించింది.
News November 15, 2025
గ్యాస్‌లైటింగ్ గురించి తెలుసా?

మానసిక వేధింపుల్లో ‘గ్యాస్‌లైటింగ్’ ఒకటి. దీన్ని అనుసరించే వారు ఎవరినైతే ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో వారితో స్నేహం చేస్తూనే వారిని తప్పుదోవ పట్టిస్తుంటారు. ఈ క్రమంలో తమపై తమకు నమ్మకం పోయేలా, తమ నిర్ణయాలపై తమకే అనుమానం వచ్చేలా చేస్తుంటారు. మానసికంగా బలహీనంగా ఉండే వారితో ఇలా ప్రవర్తిస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. ఎదుటి వారిని క్రమంగా బలహీనుల్ని చేసి తమ అధీనంలోకి తెచ్చుకోవడమే వీరి లక్ష్యం.


