News April 12, 2024
గుండెపోటుతో నటుడు మృతి
కోలీవుడ్‌లో విషాదం నెలకొంది. నటుడు అరుల్‌మణి (65) గుండెపోటుతో మృతిచెందారు. గత పది రోజులుగా అన్నాడీఎంకే తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన గురువారం అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అరుల్‌మణి మృతిపై సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సింగం2, లింగ, థెండ్రాల్ సహా 90కిపైగా చిత్రాల్లో ఆయన నటించారు.
Similar News
News November 16, 2024
రేపు, ఎల్లుండి గ్రూప్-3 పరీక్షలకు సర్వం సిద్ధం
TG: వివిధ శాఖల్లో 1,388 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి రేపు, ఎల్లుండి పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,401 కేంద్రాలను TGPSC సిద్ధం చేసింది. 5.36 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. రేపు ఉ.10 నుంచి మ.12.30 వరకు పేపర్-1, మ.3 నుంచి సా.5.30 వరకు పేపర్-2, 18న ఉ.10 నుంచి మ.12.30 వరకు పేపర్-3 ఎగ్జామ్ జరగనుంది. అభ్యర్థులు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని TGPSC సూచించింది.
News November 16, 2024
ఈ విజయం ఎప్పటికీ నాతో ఉంటుంది: సూర్య
దక్షిణాఫ్రికాపై నిన్న సాధించిన టీ20 సిరీస్ విజయం తనతో ఎప్పటికీ నిలిచిపోతుందని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. దక్షిణాఫ్రికా పర్యటనలో సిరీస్ గెలవడం అంత సులువు కాదని గుర్తుచేశారు. ‘సౌతాఫ్రికా పర్యటన ఎప్పుడైనా సవాలే. యువ జట్టుతో ఇక్కడికొచ్చి ఇలా గెలుపొందడం అద్భుతం. ఫలితం గురించి ఆలోచించకుండా ఆడాం’ అని తెలిపారు. భారత్ ఈ ఏడాది ఆడిన 26 టీ20ల్లో 24 మ్యాచుల్లో గెలవడం విశేషం.
News November 16, 2024
తులసీ.. మీ అంకితభావం ఆకట్టుకుంది: నిర్మల
అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా నియమితులైన తొలి హిందూ మహిళ తులసీ గబ్బార్డ్‌కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘సోల్జర్ నుంచి Lt.కల్నల్ వరకు 21 ఏళ్లుగా USకు సేవలందిందించారు. మీతో కలిసి పలు వేదికల్లో పాల్గొనడం సంతోషకరం. మీ ఆలోచనల్లో స్పష్టత, అంకితభావం నన్ను ఆకట్టుకున్నాయి’ అని Xలో పోస్టు చేశారు.