News April 12, 2024
చేవెళ్లలో BRSకు షాక్.. కాంగ్రెస్‌లోకి ZPTC

చేవెళ్ల మండల ZPTC మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి శుక్రవారం BRSను వీడారు. పామెన భీం భరత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. MP అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి హస్తం కండువా కప్పి ఆహ్వానించారు. అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని నిర్ణయించుకొని పార్టీలో చేరామన్నారు. ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ ఛైర్మన్ సత్యనారాయణ రెడ్డి ఉన్నారు. కాగా, రేపు KCR సభ ఉండగా ఒకరోజు ముందు కీలక నేత పార్టీ మారడం చర్చనీయాంశమైంది.
Similar News
News March 3, 2026
GHMC: ప్రభుత్వ భవనాలే రూ.వెయ్యి కోట్ల బాకీ?

GHMC విభజన తర్వాత ఖజానా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. సుమారు ₹3,000 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు పేరుకుపోవడంతో అధికారులు చర్యలకు దిగారు. బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ అయ్యాయి. గడువులోగా చెల్లించకుంటే ఆస్తులను జప్తు చేయొచ్చు. విడ్డూరమేంటంటే.. ప్రభుత్వ భవనాలే దాదాపు ₹1,000 కోట్లు బకాయి ఉన్నాయి. సామాన్యుడిపై కొరడా ఝుళిపించే యంత్రాంగం ప్రభుత్వ సంస్థల బకాయిలను ఎలా వసూలు చేస్తుందో చూడాలి.
News March 3, 2026
మంత్రి ఆకస్మిక తనిఖీ.. బల్కంపేట ఆలయ ఈవో సస్పెండ్

బల్కంపేట ఎల్లమ్మ ఆలయ ఇన్‌ఛార్జీ ఈఓ తమ్మినేని శేఖర్‌ను సస్పెండ్ చేస్తూ దేవదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఆ శాఖ మంత్రి కొండా సురేఖ ఆలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్వహణపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల్లో అన్ని మారాలని అధికారులకు హెచ్చరించారు. నిర్వహణలో బాధ్యత రహితంగా వహించిన వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించగా అధికారులు సస్పెండ్ చేశారు.
News March 3, 2026
హుస్సేన్‌సాగర్‌కు కొత్త కళ

ట్యాంక్‌బండ్ తీరానికి కొత్త కళ రాబోతోంది. బుద్ధభవన్ నుంచి సంజీవయ్య పార్క్ వరకు ఛత్ పూజ, బతుకమ్మ ఘాట్ల విస్తరణకు HMDA రూ.3.16 కోట్లతో పనులు చేపట్టనుంది. PVNR మార్గ్ వెంబడి తీరాన్ని పటిష్ఠం చేస్తూ రివెట్‌మెంట్ పనులు చేపట్టనున్నారు. పనుల్లో భాగంగా 5,424 చదరపు మీటర్ల మేర అందమైన పెయింటింగ్స్‌తో గోడలను తీర్చిదిద్దనున్నారు. నాలుగేళ్ల గడువులోగా ఈ సుందరీకరణ పనులు పూర్తి చేసేలా సర్కారు అడుగులు వేస్తోంది.


