News November 15, 2025
అల్లూరి జిల్లాలో బస్తరు.. అ’ధర’హో..!

అల్లూరి జిల్లా బస్తరు పిక్కలకు ప్రసిద్ధి. అత్యధిక పోషక విలువలు కలిగిన ఈ పిక్కలను వివిధ రకాల కూరల్లో వినియోగిస్తారు. పాడేరు, చింతపల్లి, గూడెంకొత్తవీధి తదితర మండలాల్లో ఎక్కువగా లభిస్తాయి. కిలో పిక్కలు శనివారం రూ.250 పలికిందనిగత ఏడాది రూ.100 ఉండేదని పాడేరు వాసులు తెలిపారు. ఈ ఏడాది అధిక వర్షాలు వలన పంట దెబ్బతిన్నాదని, దీంతో డిమాండ్ పెరిగి రేటు పెరిగిందని వెల్లడించారు.
Similar News
News November 15, 2025
తిరుపతి: 11వ సీటులోకి లగేజీ ఎలా వచ్చిందో..?

రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతికి బయల్దేరిన TTD మాజీ AVSO సతీష్ కుమార్ మధ్యలో చనిపోయిన విషయం తెలిసిందే. A1 భోగిలోని 29వ నంబర్ సీటును సతీశ్ కుమార్ బుక్ చేసుకోగా 11వ నంబర్ సీట్ వద్ద ఆయన లగేజీ లభ్యమైంది. శుక్రవారం ఉదయం 6.23 గంటలకు ఆ రైలు తిరుపతికి చేరుకున్నప్పుడు బెడ్ రోల్ అటెండర్ రాజీవ్ రతన్ లగేజీ గుర్తించి అధికారులకు అందజేశారు. వేరే సీట్లోకి లగేజీ ఎలా వచ్చిందనే దానిపై విచారణ కొనసాగుతోంది.
News November 15, 2025
వాహనదారులకు అవగాహన కల్పించండి: SP

రోడ్డు భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాలు తగ్గించవచ్చని నెల్లూరు ఎస్పీ డా.అజిత వేజెండ్ల సూచించారు. జిల్లాలోని పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ఆదేశించారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి అక్కడ తగు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించాలని సూచించారు.
News November 15, 2025
బాలికకు 100 సిట్ అప్స్ శిక్ష.. మృతి

నిన్న బాలల దినోత్సవం రోజునే మహారాష్ట్రలోని వాసాయిలో దారుణం జరిగింది. స్కూల్‌కు ఆలస్యంగా వచ్చిందని కాజల్ అనే ఆరోతరగతి చిన్నారికి టీచర్ 100 సిట్ అప్స్ పనిష్మెంట్ విధించింది. అవన్నీ పూర్తి చేసిన బాలిక తీవ్రమైన నొప్పితో విలవిల్లాడింది. ఇంటికి చేరుకోగానే ఆరోగ్యం క్షీణించింది. పేరెంట్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


