News November 15, 2025
విశాఖ: రెండో రోజు 48 ఎంఓయూలు

విశాఖలో 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు సీఎం చంద్రబాబు సమక్షంలో 48 ఎంఓయూలు జరిగాయి. వైద్యారోగ్యం, పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమలు, టెక్స్ టైల్స్, పర్యాటక రంగాల్లో ఒప్పందాలు చేసుకున్నారు. వీటి ద్వారా రూ.48,430 కోట్ల పెట్టుబడులు, 94,155 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మంత్రులు కందుల దుర్గేష్, టీజీ భరత్, సవిత, సీఎస్ విజయానంద్ పాల్గొన్నారు.
Similar News
News November 15, 2025
ఓటింగ్‌కి ముందు వీడియోలు వైరల్.. వివాదాల నడుమ విజయం

బిహార్ బీజేపీ అభ్యర్థి సునీల్ కుమార్ పిన్టూ సీతామఢీలో విజయం సాధించారు. అయితే ఓటింగ్‌కు ముందు పిన్టూ ఓ మహిళతో అభ్యంతరకరమైన రీతిలో ఉన్నట్లు వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే అవి ఫేక్ అని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2023లోనూ ఇదే విధంగా ఫేక్ వీడియోలు క్రియేట్ చేశారన్నారు. గతంలో ఎంపీగా పనిచేసిన పిన్టూ, తాజా ఎన్నికల్లో RJD అభ్యర్థి సునీల్ కుమార్ కుశ్వాహాను ఓడించారు. పిన్టూకి 1,04,226 ఓట్లు వచ్చాయి.
News November 15, 2025
ASF: బీర్సా స్ఫూర్తితో గిరిజనుల అభివృద్ధి: కలెక్టర్

భగవాన్ బీర్సా ముండా జయంతి సందర్భంగా గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. జనకాపూర్‌లో ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి జన్ జాతీయ గౌరవ దివస్ కార్యక్రమంలో ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు. బీర్సా ముండా చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం, బీర్సా, కొమురం భీం స్ఫూర్తితో జిల్లాలో అభివృద్ధి చర్యలు కొనసాగుతున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
News November 15, 2025
వాంకిడి: ‘ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి’

వాంకిడి మండలం ఖమన గ్రామపంచాయతీలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శనివారం ఆయన ఖమన గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. లబ్ధిదారులు నిబంధనల ప్రకారం నిర్ణీత విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఉచితంగా ఇసుకను అందిస్తుందన్నారు.


