News November 15, 2025

గద్వాల్: డబుల్ ట్రాక్ లేక రైళ్ల ప్రయాణం ఆలస్యం

image

MBNR నుంచి కర్నూల్ వరకు 130 KM డబుల్ ట్రాక్ ఏర్పాటు చేయాలని రైల్వే ప్రయాణికులు కోరుతున్నారు. ప్రస్తుతం సింగిల్ ట్రాక్ ఉండటం వల్ల రైల్వే క్రాసింగ్‌ల వద్ద రైళ్లు ఆగిపోయి, తీవ్రంగా ఆలస్యం అవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వనపర్తి రోడ్డు, శ్రీరాంనగర్, గద్వాల్, అలంపూర్ వెళ్లే ప్రయాణికులు ముఖ్యంగా ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Similar News

News November 15, 2025

ఓటింగ్‌కి ముందు వీడియోలు వైరల్.. వివాదాల నడుమ విజయం

image

బిహార్ బీజేపీ అభ్యర్థి సునీల్ కుమార్ పిన్టూ సీతామఢీ‌లో విజయం సాధించారు. అయితే ఓటింగ్‌కు ముందు పిన్టూ ఓ మహిళతో అభ్యంతరకరమైన రీతిలో ఉన్నట్లు వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే అవి ఫేక్ అని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2023లోనూ ఇదే విధంగా ఫేక్ వీడియోలు క్రియేట్ చేశారన్నారు. గతంలో ఎంపీగా పనిచేసిన పిన్టూ, తాజా ఎన్నికల్లో RJD అభ్యర్థి సునీల్ కుమార్ కుశ్వాహాను ఓడించారు. పిన్టూకి 1,04,226 ఓట్లు వచ్చాయి.

News November 15, 2025

ASF: బీర్సా స్ఫూర్తితో గిరిజనుల అభివృద్ధి: కలెక్టర్

image

భగవాన్ బీర్సా ముండా జయంతి సందర్భంగా గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. జనకాపూర్‌లో ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి జన్ జాతీయ గౌరవ దివస్ కార్యక్రమంలో ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు. బీర్సా ముండా చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం, బీర్సా, కొమురం భీం స్ఫూర్తితో జిల్లాలో అభివృద్ధి చర్యలు కొనసాగుతున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

News November 15, 2025

వాంకిడి: ‘ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి’

image

వాంకిడి మండలం ఖమన గ్రామపంచాయతీలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శనివారం ఆయన ఖమన గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. లబ్ధిదారులు నిబంధనల ప్రకారం నిర్ణీత విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఉచితంగా ఇసుకను అందిస్తుందన్నారు.