News April 12, 2024
హంతకుల రక్షణలో జగన్ బిజీ: షర్మిల
AP: వైఎస్ వివేకా హంతకులను సీఎం జగన్ రక్షిస్తున్నారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ‘వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి నిందితుడని సీబీఐ చెబుతోంది. కానీ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ హంతకులను రక్షిస్తున్నారు. హంతకులను కాపాడడమే మీ న్యాయమా? సొంత చిన్నాన్నకు న్యాయం చేయలేరా? ప్రజలు నమ్మి అధికారం ఇస్తే.. హంతకులను వెనకేసుకొస్తారా?’ అని ఆమె విరుచుకుపడ్డారు.
Similar News
News November 16, 2024
రికార్డుల వర్షం
✒ SAపై నాలుగో టీ20లో ఘన విజయం సాధించిన టీమ్ ఇండియా పలు రికార్డులను సొంతం చేసుకుంది.
✒ మెన్స్ T20Iలో 3 సార్లు 250+ స్కోర్ చేసిన తొలి జట్టు.
✒ సంజూ-తిలక్ నమోదు చేసిన 210* భాగస్వామ్యం ఏ వికెట్‌కైనా భారత్ తరఫున ఇదే అత్యధికం.
✒ ICC ఫుల్ టైమ్ టీమ్స్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు(సంజూ-109*, తిలక్-120*) సెంచరీలు చేయడం ఇదే తొలిసారి.
✒ ఒక సిరీస్‌లో 4 సెంచరీలు నమోదవడం ఇదే తొలిసారి.
News November 16, 2024
కాపురంలో చిచ్చు రేపిన నెహ్రూ కానుక!
బరోడా మహారాణి కోసం నెహ్రూ ఆర్డర్ చేసిన 1951 మోడల్ రోల్స్ రాయిస్ కారు ఓ కాపురంలో చిచ్చు రేపింది. ప్రస్తుతం దాని విలువ రూ.2.5కోట్లుగా ఉంది. అయితే తన తండ్రికి వారసత్వంగా వచ్చిన ఈ కారును కట్నంగా ఇవ్వాలని తన భర్త వేధిస్తున్నట్లు ఓ మహిళ గ్వాలియర్ కోర్టు, ఆపై సుప్రీంను ఆశ్రయించారు. తమది నిజమైన పెళ్లి కాదని, గ్రహదోషం కోసం తనను ఆమె పెళ్లి చేసుకున్నట్లు భర్త చెప్పారు. కట్నంగా కారు అడగలేదని తెలిపారు.
News November 16, 2024
KTR అరెస్ట్‌ని బీజేపీ అడ్డుకోవడం లేదు: కిషన్ రెడ్డి
TG: KTR అరెస్ట్‌ని BJP అడ్డుకుంటోందన్న విమర్శలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కొట్టిపారేశారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన KTR కేంద్ర మంత్రులెవరినీ కలవలేదని స్పష్టం చేశారు. గవర్నర్ ఏ ఫైల్‌పై సంతకం పెడుతున్నారనేది కేంద్రం పర్యవేక్షించదని వెల్లడించారు. మాజీ సీఎం KCR తరహాలోనే CM రేవంత్ రెడ్డి కూడా దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. అబద్ధపు, అరాచక పాలన కొనసాగిస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు.