News April 12, 2024
వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ

AP: ఎన్నికల వేళ రాజకీయ వలసలు జోరందుకున్నాయి. ఇవాళ ఆలూరు, కోడుమూరు టీడీపీ, బీజేపీ కీలక నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వారిలో మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్ రెడ్డి, కోట్ల హరిచక్రపాణిరెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైకుంఠం మల్లికార్జున చౌదరి, మాజీ మేయర్ శశికళ, రాష్ట్ర కురుబ సంఘం గౌరవాధ్యక్షుడు కృష్ణమోహన్ ఉన్నారు.
Similar News
News March 5, 2026
❤️నచ్చేశావ్ సంజూ..

T20WC: సంజూ శాంసన్ టీమ్ కోసం సెంచరీని కూడా లెక్క చేయలేదు. అతడు ఔటయ్యే సమయానికి భారత్ స్కోర్ 13 ఓవర్లలో 160గా ఉంది. అప్పటికే సంజూ 41 బంతుల్లో 89 రన్స్ చేశారు. సెంచరీ ముందు కూడా జట్టుకు భారీ స్కోర్ అందించాలని సిక్సర్ కోసం ట్రై చేశారు. అయితే మిస్ టైమ్ కావడంతో క్యాచ్ ఔటయ్యారు. సంజూ ఆరంభం నుంచి దూకుడుగా ఆడటంతో మిడిల్ ఆర్డర్ బ్యాటర్లపై ఒత్తిడి పడలేదు. దీంతో భారత్ ఈజీగా 253 రన్స్ చేసింది.
News March 5, 2026
విరోష్ జంటకు సీఎం శుభాకాంక్షలు

TG: సీఎం రేవంత్ రెడ్డి నూతన దంపతులు రష్మిక-విజయ్ దేవరకొండను ఆశీర్వదించారు. రిసెప్షన్ సమయంలో ఢిల్లీలో ఉన్న సీఎం.. ఇవాళ విజయ్ నివాసానికి వెళ్లారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి ఫ్యామిలీతో కలిసి ఫొటో దిగారు.
News March 5, 2026
సెమీస్.. భారత్ భారీ స్కోర్

T20WC సెమీస్‌లో ఇంగ్లండ్‌పై టీమ్ ఇండియా 253/7 స్కోర్ చేసింది. అభిషేక్(9), సూర్య(11) విఫలమవగా, సంజూ శాంసన్ 89, ఇషాన్ 39, శివమ్ దూబే 43, తిలక్ 21, హార్దిక్ 27 రన్స్‌తో రాణించారు. విల్ జాక్స్, రషీద్ చెరో 2, ఆర్చర్ ఒక వికెట్ తీశారు. విజయం కోసం ఇంగ్లండ్ 254 పరుగులు చేయాలి. ఇవాళ గెలిచిన జట్టు ఈ నెల 8న ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో పోటీ పడుతుంది.


