News November 15, 2025
కామారెడ్డి: ‘ఆహార భద్రత నిబంధనలు పాటించండి’

కామారెడ్డిలో ఆహార భద్రత నిబంధనల అమలుపై ఆహార భద్రత నియోజిత అధికారి శిరీష శనివారం పలు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా పలు దుకాణాల్లో ఉల్లంఘనలను గుర్తించినట్లు ఆమె పేర్కొన్నారు. నిబంధనలు పాటించని దుకాణదారులకు నోటీసులు జారీ చేశారు. ఆహార వ్యాపార నిర్వాహకులు తప్పనిసరిగా లేబులింగ్ నిబంధనలు పాటించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
Similar News
News November 15, 2025
JGTL: నువ్వులు క్వింటాల్ ధర @9,666

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో శనివారం (15-11-2025) వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.2061, కనిష్ఠ ధర రూ.1751, వరి ధాన్యం (1010) గరిష్ఠ ధర రూ.2055, కనిష్ఠ ధర రూ.1985, వరి ధాన్యం (BPT) ధర రూ.2061, వరి ధాన్యం (HMT) గరిష్ఠ ధర రూ.2160, కనిష్ఠ ధర రూ.2000, వరి ధాన్యం (JSR) గరిష్ఠ ధర రూ.2880, కనిష్ఠ ధర రూ.1950, నువ్వుల ధర రూ.9666గా మార్కెట్ అధికారులు తెలిపారు.
News November 15, 2025
HYD: గవర్నర్ అవార్డ్స్.. 2025 నామినేషన్లకు ఆహ్వానం

గవర్నర్ అవార్డ్స్–2025 కోసం నామినేషన్లను ఆహ్వానిస్తూ HYD రాజ్‌భవన్ ప్రకటించింది. 2020 నుంచి తమ తమ రంగాల్లో విశేష సేవలందించిన వ్యక్తులు, సంస్థలు, సంఘాలు, ట్రస్టులు ఈ అవార్డులకు అర్హులని తెలిపింది. మహిళా సాధికారత, గిరిజన అభివృద్ధి, రూరల్ హెల్త్ & మెడికల్ ఫీల్డ్, కార్పొరేట్ వాలంటీరింగ్ ముఖ్య విభాగాలు. నామినేషన్లు 5 డిసెంబర్ 2025 సా. 5 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా సమర్పించాలి.
News November 15, 2025
జగిత్యాల: యునైటెడ్ క్రిస్టియన్ ఫెలోషిప్ నూతన కార్యవర్గం ఎన్నిక

జగిత్యాల జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చి సమావేశ మందిరంలో శనివారం జిల్లా క్రిస్టియన్ ఫెలోషిప్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. 2025-27 రెండు సంవత్సరాల అధ్యక్ష, కార్యదర్శుల పదవులకు గాను ఒక్కొక్క నామినేషన్ రావడంతో ఏకగ్రీవ తీర్మానంచేసి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో గౌరవ అధ్యక్షుడిగా సమూయేలు నాయక్, జిల్లా అధ్యక్షులుగా జీవరత్నం, ఉపాధ్యక్షులుగా ఏలీయా మెంగు, శాంతి కుమార్ తదితరులను ఎన్నుకున్నారు.


