News November 15, 2025

జగిత్యాల: వృద్ధాశ్రమంలో క్రీడా పోటీలు నిర్వహణ

image

వృద్ధ తల్లిదండ్రుల పోషణ–సంక్షేమ చట్టం వృద్ధులకు పెద్ద ఆసరా అవుతోందని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ అన్నారు. అనాధ వృద్ధాశ్రమంలో వయోవృద్ధుల వారోత్సవాల సందర్భంగా అవగాహన సదస్సు, చదరంగం, పచ్చీసు, క్యారమ్ వంటి క్రీడాపోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. వృద్ధులను నిరాదరిస్తే 3 నెలల జైలు, జరిమానా విధించే అధికారం ఆర్డీవోకు ఉందని ఆయన తెలిపారు.

Similar News

News November 16, 2025

బిర్సా ముండా జయంతి.. సిరిసిల్లలో బీజేపీ నివాళులు

image

బిర్సా ముండా జయంతి సందర్భంగా బీజేపీ పట్టణ కమిటీ అత్యవసర సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించింది. గిరిజన హక్కుల కోసం పోరాడిన బిర్సా ముండా చిత్రపటానికి నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు ధూమాల శ్రీకాంత్ మాట్లాడుతూ.. బిర్సా ముండా పోరాటం గిరిజన సమాజానికి దీపస్తంభం లాంటిదని, గిరిజన సంక్షేమం కోసం బీజేపీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

News November 16, 2025

సిరిసిల్ల: టీకా కేంద్రాలను తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ రజిత

image

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం. రజిత శనివారం ఆకస్మికంగా అంబేద్కర్ నగర్, శాంతినగర్‌లలోని టీకా కేంద్రాలను తనిఖీ చేశారు. కోల్డ్ చెయిన్ నిల్వలు, రికార్డులు, ఐస్ ప్యాక్స్‌ను పరిశీలించి, సక్రమ నిర్వహణకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 0-5 ఏళ్ల పిల్లలందరికీ సకాలంలో టీకాలు అందించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఈ తనిఖీలో డాక్టర్ సంపత్ కుమార్, నవీన్ పాల్గొన్నారు.

News November 16, 2025

ఎల్లారెడ్డిపేట: ‘పదో తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించాలి’

image

పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి వినోద్ అన్నారు. శనివారం ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ ప్రభుత్వ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించిన అనంతరం విద్యార్థులు తింటున్న మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. ప్రతి విద్యార్థి పట్టుదలతో చదువుకోవాలని ఆయన సూచించారు.