News November 15, 2025

గచ్చిబౌలి స్టేడియంలో రెజోఫెస్ట్ 2025

image

గచ్చిబౌలి స్టేడియంలో 2 రోజుల రెజోఫెస్ట్ 2025 ముగిసింది. నిన్న ముఖ్యఅతిథిగా 48th ఛీప్ జస్టిస్ NV రమణ హాజరై 16 రెజోనెన్స్ కొత్త స్కూల్స్‌ ప్రారంభించారు. విజ్ఞాన్ యూనివర్సిటీ ఛైర్మన్ లావు రత్తయ్య, శాంత బయోటెక్నోస్ ఛైర్మన్ వరప్రసాద్‌రెడ్డి, యాక్టర్లు సాయిదుర్గ తేజ్, మౌళి, దర్శకుడు అనిల్ రావిపూడి విద్యార్థులకు లక్ష్య సాధన గురించి వివరించారు. నిన్న 35 క్యాంపస్‌‌‌ల విద్యార్థులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.

Similar News

News November 16, 2025

విదేశీయుల భద్రతకు పటిష్ట నిఘా: సీపీ రాజశేఖర్ బాబు

image

పోలీస్ స్టేషన్ పరిధిలోని విదేశీయుల గోప్యతకు భంగం కలగకుండా భద్రతను దృష్టిలో ఉంచుకుని పటిష్ఠమైన నిఘా ఏర్పాటు చేయాలని ఎస్.హెచ్.ఓ.లను పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఆదేశించారు. కమిషనర్ కార్యాలయంలో ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ -2025పై అధికారులకు ఆయన అవగాహన కల్పించారు. జిల్లా పర్యటనకు వచ్చే విదేశీయులు ఏ హోటల్స్‌లలో ఉంటున్నారనే వివరాలను తప్పక సేకరించాలని సూచించారు.

News November 16, 2025

అమరావతిలో ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ స్టేడియం

image

రాష్ట్రంలో క్రీడా వసతుల అభివృద్ధిపై మంత్రి నారా లోకేశ్‌తో AIFF ఛైర్మన్ కళ్యాణ్ చౌబే భేటీ అయ్యారు. అమరావతిలో 12 ఎకరాల్లో AIFF ఫుట్‌బాల్ స్టేడియం నిర్మాణం ప్రారంభించనున్నట్టు చౌబే వెల్లడించారు. గ్రాస్‌రూట్స్ ఫుట్‌బాల్‌ కోసం పీఈటీ‌లకు శిక్షణ, కోచ్‌ల గ్రేడింగ్‌లో APతో భాగస్వామ్యం కొనసాగుతుందని తెలిపారు.
ఏపీలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు డీఎస్సీలో 3% రిజర్వేషన్ ఇచ్చామని లోకేశ్ ఆయనకు తెలిపారు.

News November 16, 2025

లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట విరుద్ధం: బాపట్ల కలెక్టర్

image

లింగ నిర్ధారణ పరీక్షలు చట్టవిరుద్ధమని కలెక్టర్ డా.వినోద్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి కమిటీ, ఏఆర్టీ, సరోగసి మీటింగ్‌లు శనివారం జరిగాయి. 75 స్కానింగ్ సెంటర్లపై పర్యవేక్షణ, డెకాయ్ ఆపరేషన్లు, రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని ఆదేశించారు. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, మహిళా ఆరోగ్యం, హెచ్ఐవి సేవలలో డా. డేవిడ్సన్ సత్కారము పొందారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.