News November 15, 2025
అరకులో డిగ్రీ ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు: ప్రిన్సిపల్

అరకులోయ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సర డిగ్రీ కోర్సులో ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ పి.చలపతిరావు శనివారం తెలిపారు. బి.ఏ పొలిటికల్ సైన్స్ -28, బి.ఏ హిస్టరీ-16, బి.కాం(జనరల్)-46, బి.కాం(సీఏ)-9, బి.ఎస్సీ(మేథ్స్)-19, బి.ఎస్సీ(ఫిజిక్స్)-10 సీట్లు ఉన్నట్లు ప్రిన్సిపల్ చెప్పారు. ఆసక్తిగల విద్యార్థినులు అర్హత ధ్రువపత్రాలతో కళశాల ఆఫీసు నందు హజరుకావాలన్నారు.
Similar News
News November 16, 2025
KMR: త్వరలో చెస్ బోర్డుల పంపిణీ

సోషల్ మీడియా దుర్వినియోగం, మద్యపాన వ్యసనానికి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ‘చెస్ నెట్‌వర్క్ ఆర్గనైజేషన్’ బృందం ఓ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రామారెడ్డి (M) రెడ్డిపేట తండాకు చెందిన శంకర్‌తో పాటు బృంద సభ్యులు శనివారం కామారెడ్డి DEO రాజును కలిసి సంస్థ లక్ష్యాన్ని వివరించారు. కామారెడ్డి జిల్లాలోని అన్ని పాఠశాలలకు త్వరలో చెస్ బోర్డులను ఉచితంగా అందించనున్నట్లు వారు ప్రకటించారు.
News November 16, 2025
మెదక్ జిల్లాలో 503 కేసుల్లో రాజీ

మెదక్ జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన రాజీ పడదగిన 503 కేసుల్లో రాజీ జరిగినట్లు జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఈరోజు నిర్వహించిన జాతీయ మేఘ లోక ఆదాలత్ కార్యక్రమంలో ఇరు వర్గాలను సమన్వయం చేస్తూ పరస్పర రాజీకి అనుకూలమైన వాతావరణం కల్పించి కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు. సైబర్ నేరాల్లో 41 కేసుల్లో రూ.11,44, 608 తిరిగి ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు.
News November 16, 2025
MNCL: రైతులు లబ్ధి పొందేలా పంట సాగు చేయాలి: కలెక్టర్

మంచిర్యాల జిల్లాలోని రైతులు లబ్ధి పొందేలా పంట సాగు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో యాసంగి సీజన్ పంటల సాగుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాబోయే యాసంగి కాలంలో లబ్ధి పొందే విధంగా రైతులు పంట సాగు చేయాలని, ఆ దిశగా అధికారులు రైతులకు అవసరమైన మెలకువలు, సలహాలు అందించాలని సూచించారు.


