News November 15, 2025
‘చలో ఖమ్మం’ సభను విజయవంతం చేయాలి

సీపీఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా డిసెంబర్ 26న ఖమ్మంలో జరగనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. జోడేఘాట్‌లో ప్రచార జాతాను ప్రారంభించిన అనంతరం ఆయన కొమురం భీమ్ సమాధి వద్ద నివాళులర్పించారు. స్వాతంత్ర్య పోరాటంలో సీపీఐ పాత్రను గుర్తుచేస్తూ, ఈ జాతా జోడేఘాట్ నుంచి భద్రాచలం వరకు కొనసాగుతుందని నాయకులు తెలిపారు.
Similar News
News November 16, 2025
KMR: త్వరలో చెస్ బోర్డుల పంపిణీ

సోషల్ మీడియా దుర్వినియోగం, మద్యపాన వ్యసనానికి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ‘చెస్ నెట్‌వర్క్ ఆర్గనైజేషన్’ బృందం ఓ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రామారెడ్డి (M) రెడ్డిపేట తండాకు చెందిన శంకర్‌తో పాటు బృంద సభ్యులు శనివారం కామారెడ్డి DEO రాజును కలిసి సంస్థ లక్ష్యాన్ని వివరించారు. కామారెడ్డి జిల్లాలోని అన్ని పాఠశాలలకు త్వరలో చెస్ బోర్డులను ఉచితంగా అందించనున్నట్లు వారు ప్రకటించారు.
News November 16, 2025
మెదక్ జిల్లాలో 503 కేసుల్లో రాజీ

మెదక్ జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన రాజీ పడదగిన 503 కేసుల్లో రాజీ జరిగినట్లు జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఈరోజు నిర్వహించిన జాతీయ మేఘ లోక ఆదాలత్ కార్యక్రమంలో ఇరు వర్గాలను సమన్వయం చేస్తూ పరస్పర రాజీకి అనుకూలమైన వాతావరణం కల్పించి కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు. సైబర్ నేరాల్లో 41 కేసుల్లో రూ.11,44, 608 తిరిగి ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు.
News November 16, 2025
MNCL: రైతులు లబ్ధి పొందేలా పంట సాగు చేయాలి: కలెక్టర్

మంచిర్యాల జిల్లాలోని రైతులు లబ్ధి పొందేలా పంట సాగు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో యాసంగి సీజన్ పంటల సాగుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాబోయే యాసంగి కాలంలో లబ్ధి పొందే విధంగా రైతులు పంట సాగు చేయాలని, ఆ దిశగా అధికారులు రైతులకు అవసరమైన మెలకువలు, సలహాలు అందించాలని సూచించారు.


