News November 15, 2025
కామారెడ్డి: హైవేపై ట్రావెల్స్ బస్సుకు తప్పిన ప్రమాదం

కామారెడ్డి జిల్లా బిక్కనూర్(M) సిద్ధిరామేశ్వర్ నగర్ శివారులో శనివారం రాత్రి మహారాష్ట్ర నుంచి వస్తున్న కామాక్షి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం తప్పింది. వేగ నియంత్రణ కోసం పోలీసులు ఏర్పాటు చేసిన డ్రమ్ములను ఢీకొంది. ఆ సమయంలో ఎలాంటి వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ మద్యం మత్తులో బస్సు నడుపుతున్నట్లు SI ఆంజనేయులు తెలిపారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
Similar News
News November 16, 2025
KMR: త్వరలో చెస్ బోర్డుల పంపిణీ

సోషల్ మీడియా దుర్వినియోగం, మద్యపాన వ్యసనానికి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ‘చెస్ నెట్‌వర్క్ ఆర్గనైజేషన్’ బృందం ఓ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రామారెడ్డి (M) రెడ్డిపేట తండాకు చెందిన శంకర్‌తో పాటు బృంద సభ్యులు శనివారం కామారెడ్డి DEO రాజును కలిసి సంస్థ లక్ష్యాన్ని వివరించారు. కామారెడ్డి జిల్లాలోని అన్ని పాఠశాలలకు త్వరలో చెస్ బోర్డులను ఉచితంగా అందించనున్నట్లు వారు ప్రకటించారు.
News November 16, 2025
మెదక్ జిల్లాలో 503 కేసుల్లో రాజీ

మెదక్ జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన రాజీ పడదగిన 503 కేసుల్లో రాజీ జరిగినట్లు జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఈరోజు నిర్వహించిన జాతీయ మేఘ లోక ఆదాలత్ కార్యక్రమంలో ఇరు వర్గాలను సమన్వయం చేస్తూ పరస్పర రాజీకి అనుకూలమైన వాతావరణం కల్పించి కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు. సైబర్ నేరాల్లో 41 కేసుల్లో రూ.11,44, 608 తిరిగి ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు.
News November 16, 2025
MNCL: రైతులు లబ్ధి పొందేలా పంట సాగు చేయాలి: కలెక్టర్

మంచిర్యాల జిల్లాలోని రైతులు లబ్ధి పొందేలా పంట సాగు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో యాసంగి సీజన్ పంటల సాగుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాబోయే యాసంగి కాలంలో లబ్ధి పొందే విధంగా రైతులు పంట సాగు చేయాలని, ఆ దిశగా అధికారులు రైతులకు అవసరమైన మెలకువలు, సలహాలు అందించాలని సూచించారు.


