News April 12, 2024
శ్రీకాకుళం: మొదటి విడత ఇవిఎం రెండమనైజేషన్ ప్రక్రియ పూర్తి

మొదటి విడత ఇవిఎం రెండమనైజేషన్ ప్రక్రియ నిర్దేశిత వెబ్సైట్లో పూర్తి అయిందని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా. మనజీర్ జీలాని సమూన్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఈ.యమ్.ఎస్ 2.ఓ నిర్దేశిత వెబ్సైట్లో మొదటి విడత ఇవిఎం రెండమనైజేషన్ ప్రక్రియ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తయినట్లు జిల్లా కలెక్టర్ స్పష్టం చేసారు..
Similar News
News March 14, 2026
శ్రీకాకుళం: ఫోటోల అశ్లీల మార్ఫింగ్ చేసిన విద్యార్థిపై కేసు

శ్రీకాకుళం రూరల్ పరిధి మునసబుపేటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థినిల ఫోటోల అశ్లీల మార్ఫింగ్ అంశంలో అసలెంత మంది పాత్ర ఉందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనల నేపథ్యంలో ప్రిన్సిపల్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. కళాశాలలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిపై కేసు నమోదైంది. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపడితే మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి.
News March 14, 2026
శ్రీకాకుళం: టెన్త్ పరీక్షా కేంద్రం తెలుసుకోవాలా..QR కోడ్ మీ కోసమే

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 16న ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం విద్యార్థులకు కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిందని శ్రీకాకుళం DEO ఎ. రవిబాబు శుక్రవారం తెలిపారు. పరీక్ష కేంద్రాలను తెలుసుకునేందుకు విద్యార్థులు ఇబ్బంది పడకుండా హాల్‌టికెట్లపై (QR) కోడ్‌ను అందిస్తున్నామన్నారు. మొబైల్‌లో దీన్ని స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం చిరునామా, రూట్ మ్యాప్, పాఠశాల చిత్రం కనిపిస్తాయని పేర్కొన్నారు.
News March 14, 2026
ధాన్యం కొనుగోలుకు ఈనెల 28 లాస్ట్ డేట్: జేసీ

ప్రభుత్వ పరంగా రైతులు వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఈనెల 28 ఆఖరి తేదీ అని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఫర్మాన్ ఖాన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధాన్యం అమ్మాలనుకున్న రైతులు మీ ప్రాంతాల్లో గల రైతు సేవ కేంద్రాల్లో గల సిబ్బందిని లేదా మండల వ్యవసాయ శాఖ అధికారిని పైన తెలిపిన తేదీలోగా సంప్రదించాలని ఆయన తెలిపారు.


