News April 12, 2024

MDK: పటిష్టంగా కొనుగోలు కేంద్రాలు: అదనపు కలెక్టర్

image

జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలును పటిష్టంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా హవేలీ ఘన్పూర్ మండల్ బూరుగుపల్లి, వాడి, రాజుపేట, కొత్తపల్లి, గాజిరెడ్డిపల్లి గ్రామాల్లో పర్యటించారు. ముందుగా గ్రామాల్లో తాగునీటి సమస్యపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. డిఎస్ఓ బ్రహ్మారావు, ఫ్యాక్స్ సీఈవో సాయి తదితరులున్నారు.

Similar News

News March 3, 2026

మెదక్: సీఎం సమావేశంలో పాల్గొన్న కలెక్టర్

image

హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొన్నారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు సాగే ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ అమలుపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా అభివృద్ధిపై కలెక్టర్ నివేదికను సమర్పించారు.

News March 3, 2026

మెదక్ జిల్లా ప్రజలకు కలెక్టర్ హోలీ శుభాకాంక్షలు

image

హోలీ పండుగను పురస్కరించుకుని మెదక్ జిల్లా ప్రజలకు కలెక్టర్ ప్రతిమా సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఏకం చేసే ఈ రంగుల పండుగ, ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషపు వెలుగులు నింపాలని ఆమె ఆకాంక్షించారు. ప్రకృతి సిద్ధమైన రంగులను మాత్రమే వినియోగిస్తూ, సంప్రదాయబద్ధంగా వేడుకలను జరుపుకోవాలని జిల్లా ప్రజలకు కలెక్టర్ హితవు పలికారు. ఆనందోత్సాహాల మధ్య పండుగను ఆస్వాదించాలని ఆమె కోరారు.

News March 2, 2026

బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలి: కలెక్టర్‌

image

బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కలెక్టర్ ప్రతిమ సింగ్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, ప్లాన్ ఇండియా సంయుక్తంగా రూపొందించిన ‘బాల్య వివాహ ముక్త భారత్’ ప్రచార గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. జిల్లాను బాల్య వివాహ రహితంగా మార్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమాజంలో ఈ దురాచారంపై విస్తృత అవగాహన కల్పించాలని కోరారు