News November 16, 2025

నేలమట్టం కానున్న మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్..!

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో 1993 సంవత్సరంలో నిర్మించిన రైల్వే స్టేషన్ త్వరలో నేలమట్టం కాబోతోంది. ఈ రైల్వే స్టేషన్‌ను అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకంలో భాగంగా ఎంపిక చేశారు. కూల్చిన అనంతరం ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దగ్గర్లోనే టికెట్ బుకింగ్, విచారణ ఇలాంటివి అన్ని ఏర్పాటు చేయనున్నారు. పురాతన సామగ్రిలను మరో గదిని చూసి అందులో భద్రపరచనున్నారు.

Similar News

News November 16, 2025

అరుదైన రికార్డు.. దిగ్గజాల జాబితాలో జడేజా

image

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు నెలకొల్పారు. టెస్టుల్లో 4 వేల పరుగులు, 300 వికెట్ల ఘనత సాధించిన క్రికెటర్‌గా నిలిచారు. ఈ జాబితాలో కపిల్ దేవ్, ఇయాన్ బోథమ్, డానియెల్ వెటోరీ వంటి దిగ్గజాలు ఉండటం గమనార్హం. జడేజా నిన్న బ్యాటింగ్‌లో 27 పరుగులు చేసి, 4 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం అతడి ఖాతాలో 4017 రన్స్, 342 వికెట్స్ ఉన్నాయి.

News November 16, 2025

సంగారెడ్డి: లోక్ అదాలత్‌లో 58.42 లక్షల రికవరీ

image

సంగారెడ్డి జిల్లాలో శనివారం నిర్వహించిన లోక్ అదాలతో సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయిన 58.42 లక్షలు బాధితులకు అందించినట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. మొత్తం 1,134 కేసులను రాజీ ద్వారా పరిష్కరించినట్లు పేర్కొన్నారు. లోక్ అదాలత్ కార్యక్రమం విజయవంతం చేసేందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో పని చేయాలని పేర్కొన్నారు.

News November 16, 2025

కార్తీకంలో నదీ స్నానం చేయలేకపోతే?

image

కార్తీక మాసంలో నదీ స్నానం చేయలేని భక్తులకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. స్నానం చేసే నీటిలో గంగాజలం/నదీ జలాన్ని కలుపుకొని స్నానమాచరించవచ్చు. ఇది నదీ స్నానం చేసినంత పుణ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. అది కూడా సాధ్యం కాకపోతే, స్నానం చేసేటప్పుడు ‘గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ…’ అనే మంత్రాన్ని జపించాలని పండితులు సూచిస్తున్నారు. ఫలితంగా నదీ స్నానం చేసిన ఫలం లభిస్తుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.