News November 16, 2025
KTD: మెగా జాబ్ మేళా.. 3వేల ఉద్యోగాల భర్తీ

సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం కొత్తగూడెం క్లబ్‌లో మెగా జాబ్ మేళా జరగనుంది. 65 కంపెనీల్లో 3 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీఎండీ బలరాంతో కలిసి ఈ జాబ్ మేళాను ప్రారంభిస్తారు. నిరుద్యోగ యువత కోసం అన్ని ఏర్పాట్లు చేశామని సింగరేణి అధికారులు ప్రకటించారు. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News November 16, 2025
అరుదైన రికార్డు.. దిగ్గజాల జాబితాలో జడేజా

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు నెలకొల్పారు. టెస్టుల్లో 4 వేల పరుగులు, 300 వికెట్ల ఘనత సాధించిన క్రికెటర్‌గా నిలిచారు. ఈ జాబితాలో కపిల్ దేవ్, ఇయాన్ బోథమ్, డానియెల్ వెటోరీ వంటి దిగ్గజాలు ఉండటం గమనార్హం. జడేజా నిన్న బ్యాటింగ్‌లో 27 పరుగులు చేసి, 4 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం అతడి ఖాతాలో 4017 రన్స్, 342 వికెట్స్ ఉన్నాయి.
News November 16, 2025
సంగారెడ్డి: లోక్ అదాలత్‌లో 58.42 లక్షల రికవరీ

సంగారెడ్డి జిల్లాలో శనివారం నిర్వహించిన లోక్ అదాలతో సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయిన 58.42 లక్షలు బాధితులకు అందించినట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. మొత్తం 1,134 కేసులను రాజీ ద్వారా పరిష్కరించినట్లు పేర్కొన్నారు. లోక్ అదాలత్ కార్యక్రమం విజయవంతం చేసేందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో పని చేయాలని పేర్కొన్నారు.
News November 16, 2025
కార్తీకంలో నదీ స్నానం చేయలేకపోతే?

కార్తీక మాసంలో నదీ స్నానం చేయలేని భక్తులకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. స్నానం చేసే నీటిలో గంగాజలం/నదీ జలాన్ని కలుపుకొని స్నానమాచరించవచ్చు. ఇది నదీ స్నానం చేసినంత పుణ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. అది కూడా సాధ్యం కాకపోతే, స్నానం చేసేటప్పుడు ‘గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ…’ అనే మంత్రాన్ని జపించాలని పండితులు సూచిస్తున్నారు. ఫలితంగా నదీ స్నానం చేసిన ఫలం లభిస్తుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.


