News November 16, 2025
సిటీలో అన్ని సీజన్లలో ట్యాంకర్లకు డిమాండ్

జలమండలి పరిధిలో దాదాపు 5 సంవత్సరాలలో ట్యాంకర్ డిమాండ్ 5 రెట్లు పెరిగింది. 2021లో 59 వేలకుపైగా ఉండగా 2025 నాటికి సుమారు రెండు లక్షల చేరింది. అన్ని సీజన్లలోనూ ట్యాంకర్ల డిమాండ్ ఏర్పడగా అధికారులు కొత్త ఫిల్లింగ్ స్టేషన్ల నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఏర్పడే డిమాండ్ దృష్టిలో పెట్టుకొని చర్యలు చేపడుతున్నారు.
Similar News
News November 16, 2025
వేరుశనగ పంట కోత.. ఇలా చేస్తే మేలు

వేరుశనగ పంటలో 75 నుంచి 80 శాతం కాయలు పూర్తిగా పక్వానికి వచ్చినప్పుడు మాత్రమే పంటను కోయాలి. పంటకోత కొరకు డిగ్గర్ యంత్రాన్ని, మొక్క నుంచి కాయలను వేరుచేయటానికి త్రైషర్ యంత్రాన్ని ఉపయోగిస్తే మంచిది. త్రైషర్ ద్వారా ఒక గంటకు 2 నుంచి 2 1/2 క్వింటాళ్ల కాయలను మొక్కల నుంచి వేరుచేయవచ్చు. ఇలా కూలీల కొరతను అధిగమించవచ్చు. కోత తర్వాత కాయలను బాగా ఆరబెట్టాలి. కాయల్లో తేమ ఎక్కువ లేకుండా చూసుకోవాలి.
News November 16, 2025
తిరుపతిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

తిరుపతి బ్లిస్ హోటల్ పక్కన ఉన్న రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మృతుడు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తిగా గుర్తించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహంగా ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం రుయా మార్చురీకి మృతదేహాన్ని తరలించారు.
News November 16, 2025
NTR: నేడు వైసీపీలోకి రంగా వారసురాలు.?

దివంగత నేత వంగవీటి రంగా కుమార్తె ఆశ కిరణ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రచారం ఊపందుకుంది. నేటి ఉదయం బందర్ రోడ్డులోని రంగా విగ్రహానికి నివాళులర్పించి కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు రంగా కుమార్తె ఆశ కిరణ్ అన్నది కూడా చాలా మందికి తెలియదు. దీంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఆమె వంగవీటి రాధా ఉన్న పార్టీలో కాకుండా మరో పార్టీలో చేరే అవకాశం ఉందని, YCPలో చేరే ఛాన్స్ ఉందని చర్చ నడుస్తోంది.


