News April 12, 2024
BREAKING: సీబీఐ కస్టడీకి MLC కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. CBI అభ్యర్థన మేరకు రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు 3 రోజుల కస్టడీ విధించింది. దీంతో ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ రేపటి నుంచి ఈ నెల 15 వరకు తమ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. ఇప్పటికే ఆమెను పలు అంశాలపై ఈడీ విచారించగా.. సీబీఐ కూడా మరికొన్ని అంశాలపై ప్రశ్నించనుంది.
Similar News
News January 23, 2026
RCBని కొనుగోలు చేయనున్న అనుష్క?

RCB ఫ్రాంచైజీలో వాటా దక్కించుకోవడానికి విరాట్ కోహ్లీ భార్య, నటి అనుష్క శర్మ ప్రయత్నాలు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకోసం ఆమె బిడ్ వేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. రూ.400 కోట్లు వెచ్చించి 3% వాటా కొనాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం కోహ్లీ RCB తరఫున ఆడుతున్నారు. అటు ఈ ఫ్రాంచైజీ కోసం బిడ్ వేస్తానని అదర్ పూనావాలా <<18930355>>ఇప్పటికే<<>> ప్రకటించారు.
News January 23, 2026
‘బంగ్లాదేశ్ కథ ముగిసినట్లే’.. నిరాశలో క్రికెటర్లు

T20 WC నుంచి BAN వైదొలగడంపై ఆ దేశానికి చెందిన పలువురు క్రికెటర్లు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని మండిపడుతున్నారు. T20 కెప్టెన్ లిటన్ దాస్, టెస్ట్ కెప్టెన్ షాంటో టోర్నీలో ఆడేందుకు సిద్ధమని చెప్పినా, వారి మాటకు విలువ ఇవ్వలేదని సమాచారం. ‘బంగ్లా క్రికెట్ ముగిసినట్లే’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News January 23, 2026
VHP నేతపై దాడి.. ఉజ్జయినిలో చెలరేగిన హింస

మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో హింస చెలరేగింది. విశ్వహిందూ పరిషత్‌కు చెందిన నాయకుడిపై దాడి జరిగిన నేపథ్యంలో అల్లర్లు చెలరేగినట్టు తెలుస్తోంది. పలు బస్సులకు నిప్పుపెట్టిన అల్లరిమూకలు ఇళ్లపై రాళ్లతో దాడి చేశాయి. దీంతో ఉజ్జయినిలో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు.


