News November 16, 2025
HYD: కల్తీ టీ పొడి ఇలా గుర్తించండి!

నగరంలో కల్తీ టీ పొడిని గుర్తించలేని పరిస్థితి. అలాంటి సమయంలో నీళ్లలో ఒక దుకాణంలో తెచ్చిన టీ పొడి, మరో దుకాణంలో తెచ్చిన టీ పొడిని ఒక గ్లాసులో వేయండి. రంగు తేడా వచ్చిందా..? వెంటనే 040-21111111 ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారి దైవ నిధి తెలిపారు. ప్రజలు కల్తీ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Similar News
News November 16, 2025
కుమారుడి ఫస్ట్ బర్త్‌డే.. ఫొటో షేర్ చేసిన రోహిత్

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న తన కుమారుడు అహాన్ ఫస్ట్ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫొటోలను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘సమయం చాలా వేగంగా ముందుకు వెళ్తోంది. కానీ ప్రతి క్షణాన్ని మేము ఆస్వాదిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
News November 16, 2025
చూద్దాం పదండి.. హైదరాబాద్ అందాలు

భాగ్యనగరం అంటే చార్మినార్, గోల్కొండ మాత్రమే కాదు. చరిత్ర సుగంధం వెదజల్లే అనేక అపూర్వ కట్టడాలకు ఆవాసమిది. సంస్కృతి, కళ, నిర్మాణ కౌశలాల సమ్మేళనం. శతాబ్దాల నాటి వారసత్వ సంపద నగరంలో ముత్యాల్లా మెరిసిపోతున్నాయి. వాటి వెనుక కథలను వెలికితీసే ప్రయత్నమే ఇది. రోజూ ఓ చారిత్రక కట్టడం, ప్రముఖుల విశేషాలతో ‘హైదరాబాద్ అందాలు’ రానుంది. వారాంతాల్లో ఈ అందాలపై ఓ లుక్ వేయండి. <<18301143>>ఫలక్‌నుమా<<>>ప్యాలెస్ గురించి తెలుసుకుందాం.
News November 16, 2025
కామారెడ్డి: చికెన్, మటన్ ధరలు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో పాటు వివిధ మండలాల్లో ఆదివారం మాంసం ధరలు ఇలా ఉన్నాయి. మటన్ కిలో రూ.800, ఉండగా చికెన్ స్కిన్ రూ.210 -220, స్కిన్ లెస్ రూ.230-240, లైవ్ కోడి రూ.160 చొప్పున విక్రయిస్తున్నారు. గత వారం ధరలే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. కార్తీక మాసం కావడంతో విక్రయాలు సాధారణంగా ఉన్నాయని దుకాణాలు తెలిపారు.


