News April 12, 2024
17న భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం

TG: భద్రాచలం రామయ్య సన్నిధిలో శ్రీరామనవమి తిరుకళ్యాణ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 9 నుంచి ప్రారంభమైన ఉత్సవాలు 23వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నెల 16న ఉత్తర ద్వారం వద్ద ఎదుర్కోలు మహోత్సవం, 17న మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణోత్సవం, 18న రాములవారి మహాపట్టాభిషేకం వేడుకలు నిర్వహించనున్నారు. కళ్యాణం, పట్టాభిషేకం కోసం దేవస్థానం వెబ్‌సైట్‌లో, ఆఫ్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తున్నారు.
Similar News
News March 12, 2026
ఉగాది రోజు ఇలా చేయకండి: పండితులు

ఉగాది రోజున తప్పక పాటించాల్సిన నియమాలను పండితులు సూచిస్తున్నారు. ‘ఈ పర్వదినాన మాంసం ముట్టకూడదు. శాకాహారమే భుజించాలి. ఎవరిపై కోప్పడొద్దు. కన్నీరు పెట్టుకోకూడదు. ఈరోజుతో ఏడాది మొదలు కాబట్టి నవ్వుతూ ఉండాలి. ఇల్లు శుభ్రంగా ఉంచాలి. లేకుంటే దరిద్రం. అలాగే ఆరోజు ఎవరికీ అప్పు ఇవ్వొద్దు. ఇస్తే ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని తాగకుండా అస్సలు ఉండొద్దు’ అని చెబుతున్నారు.
News March 12, 2026
కట్టెల పొయ్యిలే దిక్కవుతున్నాయి..

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్లు సంక్షోభంలో పడ్డాయి. తమ వద్ద స్టాక్ లేదని, బుక్ చేసినా రావడం లేదని యజమానులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఇప్పటికే పలు హోటళ్లు మూతపడగా కొందరు కట్టెల పొయ్యి వాడుతున్నారు. చెన్నైలో ఓ హోటల్ యజమాని బట్టీ కట్టించుకుని పెద్ద మొత్తంలో కట్టెలు తెప్పించుకున్నారు. అటు హైదరాబాద్‌లోని పలు హోటళ్లలో ఇప్పటికే కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు.
News March 12, 2026
కాలిఫోర్నియాపై దాడికి ఇరాన్ ప్లాన్?

కాలిఫోర్నియాపై ఇరాన్ డ్రోన్ దాడి చేసే అవకాశం ఉందని అక్కడి పోలీసులను FBI అలర్ట్ చేసినట్లు ABC న్యూస్ పేర్కొంది. యుద్ధం ప్రారంభమైన మొదట్లో ఈ వార్నింగ్స్ ఇచ్చినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేస్తుందనే సమాచారం మాత్రం తమ దగ్గర లేదని FBI పేర్కొంది. అయితే ఇరాన్ యుద్ధ నౌకలు ధ్వంసమైన నేపథ్యంలో ఆ దేశ డ్రోన్లు ఇప్పుడు అంతదూరం చేరుకునే అవకాశం లేదని కొందరు విశ్లేషిస్తున్నారు.


