News November 16, 2025

గద్వాల్ స్టేషన్‌లో ఆగే రైళ్లు ఇవే..!

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రైల్వే స్టేషన్లలో చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలను ఎంపీ డీకే అరుణ రైల్వే శాఖకు పంపించారు. గద్వాల రైల్వే స్టేషన్‌లో 17022 వాస్కో- హైదరాబాద్ 12976 మైసూర్- జైపూర్ రైళ్లను నిలిపే ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. దీంతో గద్వాల్ నియోజకవర్గ ప్రజలు ఎంపీ అరుణమ్మకు ధన్యవాదాలు తెలిపారు. # SHARE IT

Similar News

News November 16, 2025

పొద్దుతిరుగుడు సాగు – విత్తన శుద్ధితో మేలు

image

ఏ పంటకైనా చీడపీడల ముప్పు తగ్గాలంటే విత్తే ముందు విత్తనశుద్ధి తప్పకుండా చేయాలి. పొద్దుతిరుగుడు పంటకు నెక్రోసిస్ వైరస్ తెగులు సమస్యను అధిగమించడానికి కిలో విత్తనానికి 3 గ్రా. థయోమిథాక్సామ్ లేదా 5ml ఇమిడాక్లోప్రిడ్‌తో విత్తనశుద్ధి చేయాలి. అలాగే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు ఉద్ధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 2 గ్రా. ఇప్రోడియాన్ 25%+కార్బండాజిమ్ 25%తో విత్తనశుద్ధి చేసుకుంటే మంచిది.

News November 16, 2025

రేపు CBI విచారణకు పుట్ట మధు..!

image

అడ్వకేట్ వామన్ రావు దంపతుల హత్య కేసులో రేపు విచారణకు హాజరు కావలసిందిగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు ఈ రోజు ఉదయం CBI నోటీసులు జారీ చేసింది. ఈ హత్య కేసులో మధుకు ప్రమేయం ఉందని వామన్ రావు కుటుంబ సభ్యులు ఆరోపించారు. నెల రోజులుగా కొనసాగుతున్న విచారణలో ప్రధాన నిందితులుగా ఉన్న వెల్ది వసంతరావు, కుంట శ్రీనివాస్, అక్కపాక కుమార్లను ఇప్పటికే CBI విచారించింది.

News November 16, 2025

లంచ్: 10కే 2 వికెట్లు డౌన్

image

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్సులో టీమ్ ఇండియా తడబడుతోంది. లంచ్ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 10 రన్స్ చేసింది. భారత్ విజయానికి మరో 114 రన్స్ అవసరం. క్రీజులో సుందర్, జురేల్ ఉన్నారు. జైస్వాల్ (0), కేఎల్ రాహుల్ (1) నిరాశపరిచారు.