News November 16, 2025
కుమారుడి ఫస్ట్ బర్త్‌డే.. ఫొటో షేర్ చేసిన రోహిత్

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న తన కుమారుడు అహాన్ ఫస్ట్ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫొటోలను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘సమయం చాలా వేగంగా ముందుకు వెళ్తోంది. కానీ ప్రతి క్షణాన్ని మేము ఆస్వాదిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
Similar News
News November 16, 2025
పొద్దుతిరుగుడు సాగు – విత్తన శుద్ధితో మేలు

ఏ పంటకైనా చీడపీడల ముప్పు తగ్గాలంటే విత్తే ముందు విత్తనశుద్ధి తప్పకుండా చేయాలి. పొద్దుతిరుగుడు పంటకు నెక్రోసిస్ వైరస్ తెగులు సమస్యను అధిగమించడానికి కిలో విత్తనానికి 3 గ్రా. థయోమిథాక్సామ్ లేదా 5ml ఇమిడాక్లోప్రిడ్‌తో విత్తనశుద్ధి చేయాలి. అలాగే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు ఉద్ధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 2 గ్రా. ఇప్రోడియాన్ 25%+కార్బండాజిమ్ 25%తో విత్తనశుద్ధి చేసుకుంటే మంచిది.
News November 16, 2025
లంచ్: 10కే 2 వికెట్లు డౌన్

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్సులో టీమ్ ఇండియా తడబడుతోంది. లంచ్ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 10 రన్స్ చేసింది. భారత్ విజయానికి మరో 114 రన్స్ అవసరం. క్రీజులో సుందర్, జురేల్ ఉన్నారు. జైస్వాల్ (0), కేఎల్ రాహుల్ (1) నిరాశపరిచారు.
News November 16, 2025
పెరుగుతో అందం పెంచేయండి..

చర్మ సమస్యలను తగ్గించడానికి పెరుగు పరిష్కారం చూపుతుంది. * అరటిపండు, తెల్లసొన, శనగపిండి, పెరుగు కలిపి ముఖానికి రాయాలి. దీనివల్ల మోము మృదువుగా మారుతుంది. * పెరుగు, మెంతి పొడి, బాదం నూనె, గులాబీ నీళ్లు కలిపి ముఖానికి పూతలా వేసి 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. * పెరుగులో రెండు చెంచాల ఓట్స్ పొడి వేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఓట్స్ చర్మానికి క్లెన్సర్‌లా పనిచేసి మృత కణాలు, మురికినీ తొలగిస్తాయి.


