News November 16, 2025
మంచిర్యాల: దివ్యాంగురాలి అనుమానాస్పద మృతి

MNCL(D) దండేపల్లి(M) వెంకటరావుపేటకు చెందిన మల్లేషం-పోషవ్వ దంపతుల కూతురు దివ్యాంగురాలైన అర్చన(15) KNR జిల్లా వావిలాలపల్లిలో శనివారం అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమె సోదరుడు అశ్రిత్ పరిస్థితి విషమంగా ఉంది. తల్లి కిరాణా షాప్‌కు వెళ్లి వచ్చే సరికి ఇద్దరూ స్పృహ కోల్పోయి కనిపించారు. ఆసుపత్రికి తరలించగా అర్చన చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటన జరిగినప్పటి నుంచి వారి తండ్రి మల్లేషం కనిపించడం లేదు.
Similar News
News November 16, 2025
పొద్దుతిరుగుడు సాగు – విత్తన శుద్ధితో మేలు

ఏ పంటకైనా చీడపీడల ముప్పు తగ్గాలంటే విత్తే ముందు విత్తనశుద్ధి తప్పకుండా చేయాలి. పొద్దుతిరుగుడు పంటకు నెక్రోసిస్ వైరస్ తెగులు సమస్యను అధిగమించడానికి కిలో విత్తనానికి 3 గ్రా. థయోమిథాక్సామ్ లేదా 5ml ఇమిడాక్లోప్రిడ్‌తో విత్తనశుద్ధి చేయాలి. అలాగే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు ఉద్ధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 2 గ్రా. ఇప్రోడియాన్ 25%+కార్బండాజిమ్ 25%తో విత్తనశుద్ధి చేసుకుంటే మంచిది.
News November 16, 2025
రేపు CBI విచారణకు పుట్ట మధు..!

అడ్వకేట్ వామన్ రావు దంపతుల హత్య కేసులో రేపు విచారణకు హాజరు కావలసిందిగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు ఈ రోజు ఉదయం CBI నోటీసులు జారీ చేసింది. ఈ హత్య కేసులో మధుకు ప్రమేయం ఉందని వామన్ రావు కుటుంబ సభ్యులు ఆరోపించారు. నెల రోజులుగా కొనసాగుతున్న విచారణలో ప్రధాన నిందితులుగా ఉన్న వెల్ది వసంతరావు, కుంట శ్రీనివాస్, అక్కపాక కుమార్లను ఇప్పటికే CBI విచారించింది.
News November 16, 2025
లంచ్: 10కే 2 వికెట్లు డౌన్

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్సులో టీమ్ ఇండియా తడబడుతోంది. లంచ్ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 10 రన్స్ చేసింది. భారత్ విజయానికి మరో 114 రన్స్ అవసరం. క్రీజులో సుందర్, జురేల్ ఉన్నారు. జైస్వాల్ (0), కేఎల్ రాహుల్ (1) నిరాశపరిచారు.


