News November 16, 2025

NLG: అంగన్వాడీల భర్తీ ఎప్పుడు..?!

image

మహిళా, శిశు సంరక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్‌, ఆయా పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఆయా కేంద్రాల పరిధిలోని బాలింతలు, గర్భిణులు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నల్గొండ జిల్లాలో 150 టీచర్ పోస్టులు, 684 ఆయా పోస్టులు, సూర్యాపేట జిల్లాలో 85 టీచర్, 290 ఆయాలు, యాదాద్రి జిల్లాలో 266 టీచర్, 58 ఆయా పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.

Similar News

News November 16, 2025

GNT: పవన్ కళ్యాణ్‌పై అంబటి సెటైరికల్ ట్వీట్

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మాజీమంత్రి అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా చురకలంటించారు. “విశాఖ CIIసమ్మిట్‌లో చిన్న కమ్మ కళ్యాణ్ గారు కనిపించలేదేంటబ్బ.?’ అంటూ అంబటి పోస్ట్ చేశారు. దీంతో జనసైనికులు, పవన్ అభిమానులు అంబటిపై సోషల్ మీడియాలో నిప్పులు చెరుగుతున్నారు. మధ్యలో కుల ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News November 16, 2025

MBNR:U-14,19..17న వాలీబాల్ ఎంపికలు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14, 19 విభాగాల్లో బాల, బాలికలకు బాస్కెట్ బాల్ ఎంపికలను నిర్వహించనున్నట్లు కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. మహబూబ్ నగర్ లోని DSA స్టేడియంలో ఈ నెల 17న ఎంపికలు ఉంటాయని, ఒరిజినల్ మెమో(U-19), బోనఫైడ్, ఆధార్‌ జిరాక్స్ పత్రాలతో ఉ.9:00 గంటలలోపు పీడీ శైలజకు రిపోర్ట్ చేయాలన్నారు.SHARE IT.

News November 16, 2025

ములుగు: జిల్లాలో సమస్యలపై స్పందన కరవు!

image

జిల్లాలో పాలన గాడి తప్పుతోంది. అధికారుల తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సమస్యలపై స్పందన కరవైందని, ఎలాంటి సమస్య ఉన్న సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. పత్రికలు, సోషల్ మీడియాలో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్న తనకేమీ పట్టనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. సరైన విచారణ, చర్యలు లేకకపోవడం అధికారుల పనితనానికి నిదర్శనం.