News November 16, 2025

నేడు కోరుట్లలో ఉమ్మడి జిల్లా స్థాయి ఖోఖో పోటీలు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి 18 సంవత్సరాల లోపు బాలబాలికల ఖోఖో టోర్నమెంట్ కం సెలక్షన్స్ నేడు కోరుట్ల కాలేజ్ గ్రౌండ్‌లో జరగనున్నాయి. కోరుట్ల స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్‌లో ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 28 నుంచి 30 వరకు మెదక్ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలలో పాల్గొననున్నారు. క్రీడాకారులందరూ సకాలంలో హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.

Similar News

News March 22, 2026

ఈ నెల 25న కాంగ్రెస్‌కు గుడ్‌బై: జీవన్ రెడ్డి

image

TG: ఈ నెల 25న కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేనని తెలిపారు. కాగా నిన్న మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ గంటన్నర సేపు బుజ్జగించినా జీవన్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. కాగా జీవన్ రెడ్డి జగిత్యాల నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలుత ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పని చేశారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు.

News March 22, 2026

HYD: కుప్పకూలిన బాల్కానీ స్లాబ్.. తండ్రీకొడుకుల మృతి

image

పంజాగుట్ట PS పరిధిలోని కుందన్‌బాగ్ శ్రీవాత్స అపార్ట్‌మెంట్‌లో ప్రమాదం జరిగింది. మూడో అంతస్తులోని బాల్కనీ పొడిగింపు కోసం ఐరన్ రాడ్‌లతో నిర్మించిన భాగం ఒక్కసారిగా కూలిపోయింది. ఎలక్ట్రిషియన్ పనికోసం వచ్చిన తండ్రీకొడుకులు వివేక్, దేవిదాస్ ప్రాణాలు కోల్పోయారు. ఇంటి యజమాని ద్వారకా ప్రసాద్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.