News November 16, 2025
కిలిమంజారోను అధిరోహించిన అనంత జిల్లా యువతి

అనంతపురం(D) నార్పల(M) దుగుమర్రికి చెందిన కె.కుసుమ(19) ఈ నెల 8న హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫ్రీస్టాండింగ్ పర్వతం కిలిమంజారో (5895M)ను 12న విజయవంతంగా అధిరోహించింది. శిఖరంపై జాతీయ జెండాతో పాటు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్, MLA బండారు శ్రావణి ఫొటోలను ఎగురవేసింది. 15న హైదరాబాద్‌కు చేరుకోనుంది.
Similar News
News March 21, 2026
అమలాపురం: లభ్యం కానీ గల్లంతైన విద్యార్థి ఆచూకీ

అమలాపురం మండలంలోని ఓడలరేవు సముద్ర తీరంలో గల్లంతైన ఇంటర్ విద్యార్థి దొమ్మేటి లోకేశ్ ఆచూకీ కోసం శనివారం రెండో రోజూ గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అమలాపురం ప్రభాకర్ నగర్‌కు చెందిన నలుగురు విద్యార్థులు సరదాగా స్నానానికి వెళ్లగా, అలల ఉధృతికి అందరూ గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు సురక్షితంగా బయటపడగా, లోకేశ్ గల్లంతైన సంగతి తెలిసిందే. అధికారుల పర్యవేక్షణలో గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
News March 21, 2026
పుట్టపర్తి: పోలీసుల పటిష్ఠ బందోబస్తు

శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో పవిత్ర రంజాన్ సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు. ప్రార్థన మందిరాలు, మసీదులు వద్ద సిబ్బందిని నియమించారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నారు. డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. ప్రార్థనలు ముగిసిన తర్వాత సాఫీగా అందరూ వెళ్లేలా చర్యలు తీసుకున్నారు.
News March 21, 2026
‘ఉస్తాద్ భగత్ సింగ్’ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

పవన్-హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ 2 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.59 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు Sacnilk తెలిపింది. ఇండియాలో రూ.52 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.7 కోట్లు సాధించినట్లు వివరించింది. మొత్తంగా రూ.44 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయంది. గురువారంతో పోల్చితే శుక్రవారం థియేటర్లలో షోలతో పాటు సీట్ల ఆక్యుపెన్సీ తగ్గిందని పేర్కొంది. మరి మీరు మూవీ చూశారా? ఎలా ఉంది?


