News November 16, 2025
శంషాబాద్: విమానంలో స్మోకింగ్ చేసిన ప్రయాణికుడు

విమానంలో పొగ తాగిన ప్రయాణికుడిని ఎయిర్ లైన్స్ సిబ్బంది పోలీసులకు అప్పగించారు. పోలీసుల వివరాలు.. రియాద్ నుంచి ఇండిగో విమానంలో శనివారం ఓ ప్రయాణికుడు శంషాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలో విమానంలోని మరుగుదొడ్డిలో పొగ తాగినట్లు ఎయిర్‌లైన్స్ సిబ్బంది గుర్తించి ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 29, 2026
దూసుకుపోతున్న విశాఖ పోర్టు.. 9 దశాబ్దాల రికార్డు బ్రేక్!

AP: విశాఖ పోర్టు చరిత్రాత్మక మైలురాయిని అందుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 362 రోజుల్లో 90.29మిలియన్ మెట్రిక్ టన్నుల సరకు రవాణా చేసి అత్యధిక వార్షిక రికార్డు నమోదు చేసింది. గతేడాది నమోదైన 82.62MMTను అధిగమించింది. 9 దశాబ్దాల చరిత్రలో ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం గమనార్హం. సమర్థవంతమైన నిర్వహణ, వ్యూహాత్మక ప్రణాళికలు, సిబ్బంది కృషి, భాగస్వామ్య సంస్థల సమన్వయంతోనే ఇది సాధ్యమైందని అధికారులు తెలిపారు.
News March 29, 2026
కృష్ణా: జవహర్ నవోదయ ప్రిన్సిపల్ స్పాట్‌డెడ్

బాపులపాడు మండలంలో ఆదివారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. వేలేరు సమీపంలో టిప్పర్ లారీని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో జవహర్ నవోదయ ప్రిన్సిపల్ యాదూనందన్ రావు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 29, 2026
మద్దూర్: బాలిక అఘాయిత్యం కేసు.. ఏడుగురి అరెస్ట్

నారాయణపేట జిల్లా మోమినాపూర్ హైస్కూల్‌లో బాలికపై జరిగిన అఘాయిత్యం కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో అఘాయిత్యానికి పాల్పడిన ఉపాధ్యాయుడితో పాటు, సాక్ష్యాలను దాచిపెట్టిన మరో టీచర్, వీడియోలు షేర్ చేసిన నలుగురు ఉన్నారు. నిందితులపై పోక్సో, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ వంటి కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.


