News November 16, 2025

సిరిసిల్ల: పడిపోయిన ఉష్ణోగ్రతలు.. వణుకుతున్న జనం

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చలి తీవ్రత పెరుగుతోంది. ఒక్కసారిగా పెరిగిన చలితో జనం వణుకుతున్నారు. చలి నుంచి రక్షణకు అవసరమైన చర్యలపై ప్రజలు దృష్టి సారించారు. వృద్ధులు, చిన్నపిల్లలు చలి మంటలు వేసుకునే దృశ్యాలు కనిపిస్తున్నాయి. స్వెటర్లు, మఫ్లర్ ధరించడం ద్వారా కొంత ఉపశమనం పొందుతున్నారు. జిల్లాలో రాత్రివేళ రుద్రంగిలో 9.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత, ఇల్లంతకుంటలో 15.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Similar News

News March 14, 2026

ఇరాన్‌పై అత్యంత శక్తిమంతమైన బాంబులు వేశాం: ట్రంప్

image

మిడిల్ ఈస్ట్ చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన బాంబులను ఇరాన్‌లోని <<19335967>>ఖర్గ్<<>> ద్వీపంపై వేశామని ట్రంప్ ప్రకటించారు. అందులోని మిలిటరీ స్థావరాలను మాత్రమే టార్గెట్ చేశామని, ఆయిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను టచ్ చేయలేదని చెప్పారు. హార్ముజ్ జలసంధిలో నౌకలను అడ్డుకుంటే మాత్రం వెంటనే ఆ పని చేసి తీరుతామని స్పష్టం చేశారు. తన హయాంలో అమెరికా సైన్యం చాలా పవర్‌ఫుల్‌గా మారిందని, తమ దాడులను తట్టుకునే శక్తి ఇరాన్‌కు లేదన్నారు.

News March 14, 2026

హుస్నాబాద్: ఒకే బస్సులో తండ్రీకొడుకుల డ్యూటీ

image

హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఒక అరుదైన దృశ్యం కనిపించింది. 34 ఏళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్న బంధనాపురం ఎల్లయ్య, ఆయన కుమారుడు ప్రేమ్(కండక్టర్) శుక్రవారం ఒకే బస్సులో కలిసి విధులు నిర్వహించారు. తండ్రి డ్రైవింగ్ చేస్తుంటే కుమారుడు టికెట్లు జారీ చేయడం ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంది. ఒకే వృత్తిలో ఉంటూ ఇలా ఒకే బస్సులో డ్యూటీ చేయడంపై తోటి సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

News March 14, 2026

కర్నూలు జిల్లాలో ఒంటిపూట బడి.. టైమింగ్స్ ఇవే..!

image

ఈ నెల 16 నుంచి జిల్లా వ్యాప్తంగా ఒంటిపూట బడులు నిర్వహించాలని కర్నూలు డీఈవో సుధాకర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్కూళ్లు ఉదయం 7:45 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 12:30 గంటలకు ముగించాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థికి భోజన వసతిని కల్పించాలన్నారు. 10వ తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు.