News November 16, 2025

జగిత్యాల: 4 జంటలను కలిపిన లోక్ అదాలత్

image

జగిత్యాల జిల్లా కోర్టులో NOV 15 నుంచి జరుగుతున్న ప్రత్యేక లోక్ అదాలత్‌ను ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి సూచించారు. సంవత్సరాల తరబడి లాగకుండా, రాజీతో వేగంగా కేసులను పరిష్కరించేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని తెలిపారు. ఇప్పటివరకు న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసుల చొరవతో విడాకుల అంచున ఉన్న నలుగురు దంపతులను ఈ లోక్ అదాలత్ మళ్లీ కలిపింది.

Similar News

News March 25, 2026

పవన్ సినిమాల్లో నటించొద్దని పిటిషన్.. కొట్టేసిన హైకోర్టు

image

AP: సినిమాల్లో నటించకుండా Dy.CM పవన్ కళ్యాణ్‌పై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ‘హరిహరవీరమల్లు’ టికెట్ ధరల పెంపు విషయంలో చట్టనిబంధనలు అనుసరించలేదని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మాజీ IAS అధికారి విజయ్ కుమార్ ఆరోపించారు. నిర్మాత అభ్యర్థన మేరకే ప్రభుత్వం టికెట్ ధరలు పెంచిందని.. సీఎం, మంత్రులు సినిమాల్లో నటించడంపై ఎలాంటి నిషేధం లేదని పవన్ తరఫు లాయర్లు వాదించారు.

News March 25, 2026

సింహాచలం: చంద‌నోత్స‌వం రోజున కార్యక్రమాలు ఇలా..

image

సింహాచలం చంద‌నోత్స‌వానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరోజున వేకువ జాము ఒంటి గంట‌కు సుప్ర‌భాత సేవ‌, 3 గంట‌ల‌కు ఆల‌య వ్య‌వ‌స్థాప ధ‌ర్మ‌క‌ర్త‌ తొలి ద‌ర్శ‌నం ప్రారంభమ‌వుతుంది. 3.30 గంటలకు ప్ర‌భుత్వం నుంచి ప‌ట్టువ‌స్త్రాలు, అనంత‌రం తితిదే వారి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తారు. 4.15 నుంచి 4.30 గంట‌ల లోపు మొద‌టి స్లాట్ వీఐపీ ద‌ర్శ‌నాలు మొద‌ల‌వుతాయి. 4 గంట‌ల నుంచి ద‌ర్శ‌నాలు ప్రారంభ‌మ‌వుతాయి.

News March 25, 2026

జగిత్యాల ఎంపీ స్థానం ఖాయమేనా..?

image

నియోజకవర్గాల పునర్విభజన అంశం ఉమ్మడి KNR(D)లో కొత్త చర్చకు తెరలేపింది. ప్రస్తుతం ఉన్న 13 అసెంబ్లీ స్థానాలు పునర్విభజన తర్వాత 21కి పెరిగే అవకాశం ఉండటంతో, KNR, పెద్దపల్లితో పాటు మరో లోక్‌సభ స్థానం ఏర్పడే వీలుంది. ప్రస్తుతం నిజామాబాద్ MP పరిధిలో ఉన్న JGTL, KRTL నియోజకవర్గాలతో పాటు మరికొన్నింటిని కలిపి జగిత్యాల లోక్ సభ స్థానం ఏర్పాటయ్యే అవకాశముంది. దీంతో జిల్లా రాజకీయ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి.