News November 16, 2025

MBNR: FREE కోచింగ్.. అప్లై చేసుకోండి

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గ్రామీణ మహిళలకు SBI, RSETI ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ జి.శ్రీనివాస్ ‘Way2News’తో తెలిపారు. బ్యూటీపార్లర్ కోర్సులలో ఈనెల 18 నుంచి ఉచిత శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. వయసు 19-45 లోపు ఉండాలని, SSC MEMO, రేషన్, ఆధార్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రం, 3 ఫొటోలతో ఈనెల 17లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వివరాలకు 95424 30607 సంప్రదించాలన్నారు. #SHARE IT

Similar News

News November 16, 2025

3Dలోనూ అఖండ-2

image

బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలకృష్ణ నటిస్తోన్న అఖండ-2 సినిమాను 3Dలోనూ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఫ్యాన్స్‌కు కొత్త అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ఫార్మాట్‌లోనూ తీసుకొస్తున్నట్లు బోయపాటి చెప్పారు. ‘ఈ చిత్రం దేశ ఆత్మ, పరమాత్మ. సనాతన ధర్మం ఆధారంగా మూవీని రూపొందించాం. ఈ సినిమాను దేశమంతా చూడాలనుకుంటున్నాం. అందుకే ముంబై నుంచి ప్రచారం ప్రారంభించాం’ అని పేర్కొన్నారు.

News November 16, 2025

సంగారెడ్డి: పద్మశాలి ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం

image

తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం సంగారెడ్డి, మెదక్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికలు సంగారెడ్డిలో జరిగాయి. సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రవికుమార్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. అధ్యక్షుడిగా జట్ల భాస్కర్, అసోసియేట్ ప్రెసిడెంట్లు చింతా బలరాం, డా.గిరి, ఉపాధ్యక్షులు డా.శ్వేత, ఆంజనేయులు, యాదగిరి, ప్రధాన కార్యదర్శి వరప్రతాప్, సహాయ కార్యదర్శి అరుంధతి, వెంకటేశం, కోశాధికారి శివకుమార్ ఉన్నారు.

News November 16, 2025

సంగారెడ్డి: 18 నుంచి జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్: డీఈవో

image

ఈ నెల 18 నుంచి 20 ఖేడ్‌లోని ఈ-తక్షిలా పాఠశాలలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ & ఇన్‌స్పైర్ అవార్డ్స్‌కు హాజరయ్యే విద్యార్థులు రెండు సెట్ల రైట్ అప్స్, సంబంధించిన వస్తువులు తప్పనిసరిగా తీసుకురావాలని తెలియజేసారు. అలాగే మూడు రోజులకు విద్యార్థులకు అవసరమయ్యే వస్తువులను తీసుకురావాలని సూచించారు.