News April 12, 2024

వాలంటీర్లు మా కార్యకర్తలే: మంత్రి ధర్మాన

image

శ్రీకాకుళం జిల్లాలో జరిగిన సమావేశంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల మన పార్టీ కార్యకర్తలని అన్నారు. నామినేషన్ రోజు 25 మంది వాలంటీర్లను తీసుకురావాలని కోరారు. వాలంటీర్లను రాజీనామాలు చేయించండి అని కార్యకర్తలకు సూచించారు. వాలంటీర్లతో పని చేయించాలని జిల్లాలోని ఆ పార్టీ కేడర్‌కు సూచించారు. మళ్ళీ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News April 6, 2026

శ్రీకాకుళం జిల్లా ప్రజలకు అలర్ట్..!

image

శ్రీకాకుళం జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో సోమ, మంగళవారాలలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. విభిన్న వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. వర్షాలు పడేటప్పుడు ప్రజలు బయట తిరగకూడదని సూచించారు.

News April 6, 2026

SKLM: 11 మంది పిల్లలపై పిచ్చి కుక్క దాడి

image

పొందూరులో పిచ్చికుక్క రెండు రోజుల్లో వీరంగం సృష్టించింది. మండల కేంద్రంలోని నాయుడువీధి, గాంధీనగర్, మార్కెట్ లైన్, కనకాల వీధిలలో 15 ఏళ్ల లోపు 11 మంది పిల్లలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. బాధితులను శ్రీకాకుళం RIMSకు తరలించారు. మిగతా వారికి పొందూరు సామాజిక హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నారు. కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజులు కోరుతున్నారు.

News April 6, 2026

శ్రీకాకుళం జిల్లా ప్రజలకు అలర్ట్.. పిడుగులతో కూడిన వర్షాలు

image

శ్రీకాకుళం జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో సోమవారం, మంగళవార లలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. విభిన్న వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. వర్షాలు పడినప్పుడు ప్రజలు బయట తిరగకూడదని సూచించారు.