News November 16, 2025

సిద్దిపేట: కొండెక్కిన కోడి కూర ధర!

image

కార్తీక మాసంలో కూడా చికెన్ ధరలు మండిపోతున్నాయి. జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. పట్టణంతోపాటు వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 220 నుంచి రూ.240 మధ్య ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ.260 నుంచి రూ.270 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే రూ.20 వరకు పెరిగింది. సిద్దిపేట మార్కెట్లో నాటుకోడి ధర కూడా కిలో రూ.500 పైనే పలుకుతుంది. ధరలు పెరగడంతో మాంస ప్రియులు నిట్టూరుస్తున్నారు.

Similar News

News March 11, 2026

వరంగల్: బార్లలో ‘తక్కువ’కే మద్యం!

image

వరంగల్ నగరంలోని మద్యం విక్రయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సాధారణంగా వైన్ షాపుల కంటే బార్లలో ధరలు అధికంగా ఉండాలి. కానీ, ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి తలకిందులైంది. లైసెన్సు ఫీజుల భారం, పెరిగిన లిక్కర్ మార్టుల పోటీతో బార్లలో గిరాకీ తగ్గింది. నష్టాల నుంచి గట్టెక్కేందుకు బార్ల యజమానులు వైన్ షాపుల కంటే తక్కువ ధరలకే మద్యాన్ని విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామం నగరంలో చర్చనీయాంశంగా మారింది.

News March 11, 2026

IPL-2026: ఫస్ట్ మ్యాచ్ ఈ జట్ల మధ్యే?

image

ఈసారి ఐపీఎల్ ఆరంభ మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్, రన్నరప్ తలపడబోవని క్రిక్‌బజ్ తెలిపింది. బెంగళూరు, పంజాబ్ వేర్వేరుగా ఆడనున్నాయని పేర్కొంది. సంప్రదాయం ప్రకారం హై ప్రొఫైల్ మ్యాచుతో టోర్నమెంట్ స్టార్ట్ చేస్తారు. ఈసారి ఫస్ట్ మ్యాచ్ మార్చి 28న బెంగళూరు-చెన్నై మధ్య జరిగే అవకాశం ఉందని తెలిపింది. రన్నరప్ అయిన పంజాబ్ 29న GTతో ఆడవచ్చని వెల్లడించింది. కాగా మార్చి 12/13న IPL షెడ్యూల్ రిలీజ్ కానుంది.

News March 11, 2026

దేవరకద్రలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లాలో జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేవరకద్రలో అత్యధికంగా 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గండీడు (36.0), భూత్పూర్ (35.7), కోయిలకొండ (35.6) మండలాల్లోనూ ఎండ ప్రభావం అధికంగా ఉంది. చిన్నచింతకుంట, అడ్డాకుల, నవాబుపేట ప్రాంతాల్లో 34 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చిలోనే ఎండలు ముదురుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.