News November 16, 2025
పుట్ట మధుకు CBI పిలుపు.. మంథని బీఆర్ఎస్‌లో టెన్షన్

న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య కేసులో విచారణకు రావలసిందిగా పుట్ట మధును CBI పిలవడంతో మంథని బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది. హత్యలో పుట్ట మధు ప్రమేయం ఉన్నట్లు తేలితే మంథనిలో బీఆర్ఎస్ భవిష్యత్తు ఏంటన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో నడుస్తుంది. గత నెల రోజులుగా పెద్దపల్లిలో తిష్ట వేసిన CBI ఎఫ్ఐఆర్‌లో నిందితులుగా ఉన్నవారందరినీ ఇప్పటికే విచారించింది.
Similar News
News November 16, 2025
గతంలో ఇచ్చిన స్లిప్పులు తీసుకురావాలి: కలెక్టర్

కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. అన్ని శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలు, గతంలో ఇచ్చిన స్లిప్పులు తీసుకురావాలని సూచించారు. సమస్య పరిష్కరించిన తర్వాత SMS ద్వారా సమాచారం చేరవేస్తామని తెలిపారు.
News November 16, 2025
‘గీత కార్మికుల హామీలు నెరవేర్చాలి’

కల్లు గీత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని అంబేద్కర్ భవన్‌లో ఆదివారం జరిగిన జిల్లా మహాసభలో మాట్లాడారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28న సూర్యాపేటలో రణభేరిని నిర్వహిస్తున్నట్లు వెంకటేశ్వర్లు తెలిపారు.
News November 16, 2025
మీకోసంను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో మీకోసం కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేస్తే తగు విచారణ జరిపి పరిష్కరిస్తామన్నారు.


