News November 16, 2025

ములుగు: జిల్లాలో సమస్యలపై స్పందన కరవు!

image

జిల్లాలో పాలన గాడి తప్పుతోంది. అధికారుల తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సమస్యలపై స్పందన కరవైందని, ఎలాంటి సమస్య ఉన్న సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. పత్రికలు, సోషల్ మీడియాలో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్న తనకేమీ పట్టనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. సరైన విచారణ, చర్యలు లేకకపోవడం అధికారుల పనితనానికి నిదర్శనం.

Similar News

News March 22, 2026

కడప: CI అశోక్‌పై ‘నాన్‌ బెయిలబుల్‌’ కేసు..!

image

గతంలో చిన్నచౌకు, చింతకొమ్మదిన్నె స్టేషన్లలో సీఐగా పనిచేసిన అశోక్‌రెడ్డిపై నమోదైన నాన్‌ బెయిలబుల్‌ కేసు పోలీస్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఆస్తుల సెటిల్మెంట్ల కోసం తనను బెదిరించడమే కాకుండా, 2 రోజులపాటు అక్రమంగా నిర్బంధించారంటూ అనంతపురానికి చెందిన బాధితుడు ప్రభాకర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు చింతకొమ్మదిన్నె పోలీసులు సీఐపై కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేపట్టారు.

News March 22, 2026

ఆయిల్ పామ్ అంటే?

image

‘ఆయిల్ పామ్’ అనేది వంట నూనె అవసరాల కోసం సాగు చేసే వాణిజ్య పంట. ఇతర నూనె గింజల పంటలతో పోలిస్తే అధిక దిగుబడి ఇస్తుంది. దీని పండ్ల గుజ్జు నుంచి పామాయిల్, గింజల నుంచి పామ్ కెర్నల్ ఆయిల్ తీస్తారు. మొక్క నాటిన 3-4 ఏళ్ల నుంచి దిగుబడి మొదలై 25-30 ఏళ్ల వరకు లాభాలిస్తుంది. దీని సాగుకు సమృద్ధిగా నీరు, 21°C-32°C మధ్య ఉష్ణోగ్రత అవసరం. అంతర పంటలకు అవకాశం ఉండటంతో పాటు ప్రభుత్వాల రాయితీ రైతుకు మేలు చేస్తుంది.

News March 22, 2026

ప.గో: తినీ తినక కిస్తీలు కడుతున్నాం.. మా ఇళ్లు మాకు ఇవ్వండి!

image

సొంతింటి కల నెరవేరుతుందని ఏళ్లుగా ఎదురుచూస్తున్న టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు నిరాశే మిగులుతోంది. దసరా, సంక్రాంతి, ఉగాది అంటూ గడువు పొడిగిస్తున్నారే తప్ప ఇళ్లను అప్పగించడం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఒకవైపు బ్యాంకులకు ఈఎంఐలు చెల్లిస్తూ, మరోవైపు అద్దె ఇళ్ల భారం మోయలేక తిని తినక కాలం వెళ్లదీస్తున్నామని వాపోతున్నారు. తక్షణమే ఇళ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.