News November 16, 2025
IPL 2026 వేలానికి స్టార్ ప్లేయర్లు

వచ్చే IPL సీజన్ కోసం మొత్తం 10 ఫ్రాంచైజీలు రిటైన్డ్, రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాలను ప్రకటించాయి. దీంతో స్టార్ క్రికెటర్లు వేలానికి వచ్చారు. ఆండ్రీ రస్సెల్, గ్లెన్ మాక్స్‌వెల్ , లివింగ్‌స్టోన్ వంటి ప్లేయర్లు బిడ్డింగ్‌లో టార్గెట్ కానున్నారు. అదే విధంగా పతిరణతో పాటు జోష్ ఇంగ్లిస్, బిష్ణోయి, జంపా, డేవిడ్ మిల్లర్, వెంకటేశ్ అయ్యర్ వంటి కీలక ఆటగాళ్లు కూడా మినీ వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.
Similar News
News March 20, 2026
‘పిరికిపందలు’.. నాటో దేశాలపై ట్రంప్ ఫైర్!

ఇరాన్‌పై పోరులో నాటో దేశాలు భాగం కాకపోవడంపై US అధ్యక్షుడు ట్రంప్ మరోసారి విమర్శలు గుప్పించారు. US లేకపోతే నాటో ఎందుకూ పనికిరాదని విమర్శించారు. ఆయిల్ ధరలపై ఆ దేశాలు ఫిర్యాదు చేస్తున్నాయి కానీ హార్ముజ్‌ను క్లియర్ చేసేందుకు మాత్రం సహాయపడట్లేదన్నారు. హార్ముజ్‌ను క్లియర్ చేయడం ఆ దేశాలకు సులువైన పనేనని అన్నారు. ఈ వైఖరిని గుర్తుపెట్టుకుంటానన్న ట్రంప్.. నాటో దేశాలను పిరికిపందలుగా అభివర్ణించారు.
News March 20, 2026
వ్యాధులను ముందే పసిగట్టే డివైజ్‌లు

క్యాన్సర్ సహా అన్ని వ్యాధులను ముందుగానే గుర్తించేందుకు నెక్ట్స్ జనరేషన్ ఫ్లెక్సిబుల్ సెమీ కండక్టర్ డివైజ్‌లను IIT జోధ్‌పుర్ సైంటిస్టులు అభివృద్ధి చేస్తున్నారు. ఇవి శరీరం నుంచి వెలువడే బయో కెమికల్స్, కండరాల కదలిక, బాడీ టెంపరేచర్, హార్ట్ రేట్‌ను నిత్యం పర్యవేక్షిస్తాయి. ఏవైనా తేడాలు గుర్తించగానే సిగ్నల్ ఇస్తాయి. వీటిని యూనిఫామ్స్ లేదా ప్రత్యేక ప్యాచ్‌లలో ఎక్కువసేపు ధరించినా ఇబ్బంది ఉండదు.
News March 20, 2026
రేషన్‌కార్డులు ఉన్నవారికి సీఎం గుడ్ న్యూస్

TG: బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ <<19431944>>పథకంపై<<>> సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఫ్యామిలీకి ఈ సౌకర్యం వర్తిస్తుందని తెలిపారు. ‘కేవలం మాటలకే పరిమితం కాకుండా సామాన్యుడి జీవితానికి భద్రత కల్పించడమే మా లక్ష్యం. తెలంగాణలో పుట్టడం, జీవించడం ఒక వరంగా భావించేలా మా ప్రభుత్వం పనిచేస్తుంది’ అని మీడియాతో చిట్‌చాట్‌లో పేర్కొన్నారు.


