News November 16, 2025
ADB: జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించాలని వినతి

తెలంగాణ ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డిని మాజీ ఎంపీ రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలన్నారు. ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో ఉన్న నాగోబా ఆలయ అభివృద్ధిపై చర్చించినట్లు వెల్లడించారు.
Similar News
News March 16, 2026
JGTL: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎంపీ లేఖ

జగిత్యాల జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సోమవారం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌కు లేఖ రాశారు. ఈ సంవత్సరం పెద్ద ఎత్తున రైతులు మొక్క పంటను సాగు చేశారన్నారు. పంట కోత పూర్తయ్యే వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే రైతులకు కనీస మద్దతు ధర రూ.2,400 అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
News March 16, 2026
నంద్యాల జిల్లా కలెక్టర్ అసంతృప్తి

నంద్యాల జిల్లాలో 49,931 మంది అర్హులలో కేవలం 10,324 మంది మాత్రమే స్కిల్ డెవలప్‌మెంట్ టెస్ట్‌కు హాజరుకావడం పట్ల కలెక్టర్ రాజకుమారి అసంతృప్తి వ్యక్తం చేశారు. వారిలో 4,071 మంది మాత్రమే అర్హత సాధించారని తెలిపారు. మిగిలిన వారు ఎందుకు హాజరు కాలేదో అధికారులు సమీక్షించాలని ఆదేశించారు. మున్సిపాలిటీల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులు సాధించేందుకు క్షేత్రస్థాయిలో పనితీరు మెరుగుపరచాలని అధికారులకు సూచించారు.
News March 16, 2026
SRH కెప్టెన్‌గా అభిషేక్ శర్మ!

IPL: సన్‌రైజర్స్ జట్టుకు కొత్త కెప్టెన్ రానున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆరంభ మ్యాచులకు దూరం కానున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. దీంతో ఆయన స్థానంలో ఓపెనింగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనున్నట్లు అంచనా వేస్తున్నాయి. వెన్నునొప్పితో బాధపడుతున్న కమిన్స్ T20WCలో సైతం ఆడలేదు. పూర్తిగా కోలుకోవడానికి మరో 2 నుంచి 3 వారాలు పట్టే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.


