News November 16, 2025
వనపర్తి: న్యాయ సాధన దీక్ష చేపట్టిన బీసీలు

బీసీ రిజర్వేషన్లు ఎవరో ఇచ్చే బిక్ష కాదని ఇది బీసీల హక్కని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి ముకుంద నాయుడు అన్నారు. పట్టణంలోని మర్రికుంట ధర్నాచౌక్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం, BC JAC ఆధ్వర్యంలో బీసీల న్యాయ సాధన దీక్ష చేపట్టారు. వారు మాట్లాడుతూ.. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు పెంచడానికి, పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యుల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు.
Similar News
News November 16, 2025
మీకోసంను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో మీకోసం కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేస్తే తగు విచారణ జరిపి పరిష్కరిస్తామన్నారు.
News November 16, 2025
కొత్తగూడెం: రేపు డివిజన్ కేంద్రాల్లో ప్రజావాణి

ప్రజల సౌకర్యార్థం భద్రాచలం సబ్ కలెక్టర్, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రకటించారు. జిల్లాలోని భూసమస్యల పరిష్కారానికి ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నందున, వారి సౌకర్యార్థం డివిజన్ల వారీగా ప్రజావాణి నిర్వహణకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇతర సమస్యల కోసం కలెక్టరేట్‌లోని ఇన్ వార్డులో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
News November 16, 2025
సంగారెడ్డి: జిల్లా విద్యాశాఖ ప్రత్యేక అధికారిగా రమేష్

ప్రభుత్వ పాఠశాలల్లో కార్యక్రమాల అమలును పర్యవేక్షించేందుకు సంగారెడ్డి జిల్లా ప్రత్యేక అధికారిగా ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ రమేష్ నియమితులయ్యారు. ఈ నెల 17 నుంచి 22 వరకు 10 మండలాల్లోని 10 పాఠశాలల్లో ‘5.0’ కార్యక్రమాల అమలును ఆయన పరిశీలిస్తారని DEO వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ తనిఖీలకు సిద్ధంగా ఉండాలని ప్రధానోపాధ్యాయులకు ఆయన సూచించారు. తనిఖీల అనంతరం రమేష్ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారని పేర్కొన్నారు.


