News April 12, 2024

వైసీపీకి షాక్.. టీడీపీలోకి బీసీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి

image

శ్రీశైలం మండలంలో వైసీపీకి షాక్ తగిలింది. మండల అధ్యక్షుడు, బీసీ సంఘం కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు, బీసీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జింకా గుండయ్య యాదవ్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం ఆయన గృహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి సమక్షంలో తన అనుచర గణంతో టీడీపీలో చేరారు. నియోజకవర్గం నుంచి రాజన్న భారీ మెజార్టీతో గెలుస్తారని గుండయ్య ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News March 24, 2026

నేర నియంత్రణలో రాజీ పడవద్దు: SP విక్రాంత్

image

కర్నూలు జిల్లాలో నేర నియంత్రణే ప్రధాన లక్ష్యంగా పోలీసులు సమర్థవంతంగా పనిచేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌పై ప్రత్యేక దృష్టి, డ్రోన్ కెమెరాలతో పెట్రోలింగ్, రాత్రి గస్తీ బలోపేతం చేయాలని సూచించారు. పెండింగ్ కేసులను పకడ్బందీగా విచారించి పరిష్కరించాలన్నారు.

News March 24, 2026

ఎలక్టర్ల మ్యాపింగ్ వేగవంతం చేయాలి: కలెక్టర్ సిరి

image

ఎలక్టర్ల మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కర్నూలు కలెక్టరేట్ నుంచి ఈఆర్ఓ, ఏఈఆర్ఓలతో వీసీ నిర్వహించి సమీక్షించారు. ఆదోని, పాణ్యం, కర్నూలు నియోజకవర్గాల్లో మ్యాపింగ్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని అసహనం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించి నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.