News November 16, 2025

కష్టాల్లో టీమ్ ఇండియా.. 75కే 6 వికెట్లు

image

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్సులో టీమ్ ఇండియా కష్టాల్లో పడింది. 124 పరుగుల లక్ష్యఛేదనలో 74 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. మంచి భాగస్వామ్యం నెలకొల్పిన సుందర్ (31), జడేజా (16) ఔటయ్యారు. ప్రస్తుతం కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి మరో 49 రన్స్ అవసరం. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

Similar News

News March 19, 2026

పాక్‌లో ఆర్థిక సంక్షోభం.. రిపబ్లిక్ డే వేడుకలు రద్దు

image

పశ్చిమాసియాలో యుద్ధంతో పాకిస్థాన్‌లో ఇంధన, ఆర్థిక సంక్షోభం పెరిగిపోయింది. దీంతో మార్చి 23న ఇస్లామాబాద్‌లో జరగాల్సిన రిపబ్లిక్ డే పరేడ్‌ను ప్రధాని షెహబాజ్ షరీఫ్ రద్దు చేశారు. జెండా ఆవిష్కరణ మాత్రమే ఉంటుందని తెలిపారు. దీంతో సైనిక కవాతు, 31 గన్ సెల్యూట్, సాంస్కృతిక కార్యక్రమాలు ఉండవు. దేశ గౌరవానికి నిదర్శనంగా నిలిచే వేడుకలు రద్దు కావడం ఆ దేశ దుర్భర స్థితికి నిదర్శనమని పలువురు పేర్కొంటున్నారు.

News March 19, 2026

రేవంత్‌కు పాలనాపరంగా ఇబ్బందుల్లేవు.. పంచాంగ శ్రవణం

image

TG: నూతన సంవత్సరంలో వాణిజ్యం పంటలు సమృద్ధిగా పండుతాయని రవీంద్ర భారతిలో నిర్వహించిన ఉగాది పంచాంగ శ్రవణంలో బాచంపల్లి సంతోశ్ కుమార్ వెల్లడించారు. రైతులు ఆనందంగా ఉంటారని తెలిపారు. ఒడిదుడుకులు ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డికి పాలనాపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. TPCC చీఫ్ మహేశ్ గౌడ్ నూతన పదవులు చేపడతారని పేర్కొన్నారు.

News March 19, 2026

మే 20న ‘ఊసరవెల్లి’ రీరిలీజ్

image

సురేందర్ రెడ్డి-జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఊసరవెల్లి’ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరో బర్త్ డే సందర్భంగా మే 20న రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 2011లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఎన్టీఆర్ స్టైలిష్ యాక్షన్, సాంగ్స్, విభిన్నమైన కథాంశం కారణంగా ఫ్యాన్ ఫేవరెట్‌గా నిలిచింది. ఈ మూవీలో తమన్నా హీరోయిన్‌గా నటించారు.