News November 16, 2025

గోపాల్‌పేటకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

image

వనపర్తి సంస్థానంలో భాగంగా 1711లో గోపాల్‌పేట సంస్థానం ఏర్పడింది. చరిత్ర ప్రకారం.. వనపర్తి, గోపాల్‌పేట ఉమ్మడి ప్రాంతాలను పూర్వం పానుగంటి సీమ అని పిలిచేవారు. సుమారు 300 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ సంస్థానానికి, వనపర్తి, గోపాల్‌పేట సంస్థానాల మూలపురుషుడు జనంపల్లి వీరకృష్ణారెడ్డి పెద్ద కుమారుడైన వెంకటరెడ్డి గోపాలరావు పేరు మీదగా గోపాల్‌పేట అని పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది.

Similar News

News November 16, 2025

మీకోసంను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో మీకోసం కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేస్తే తగు విచారణ జరిపి పరిష్కరిస్తామన్నారు.

News November 16, 2025

కొత్తగూడెం: రేపు డివిజన్ కేంద్రాల్లో ప్రజావాణి

image

ప్రజల సౌకర్యార్థం భద్రాచలం సబ్ కలెక్టర్, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రకటించారు. జిల్లాలోని భూసమస్యల పరిష్కారానికి ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నందున, వారి సౌకర్యార్థం డివిజన్ల వారీగా ప్రజావాణి నిర్వహణకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇతర సమస్యల కోసం కలెక్టరేట్‌లోని ఇన్ వార్డులో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

News November 16, 2025

సంగారెడ్డి: జిల్లా విద్యాశాఖ ప్రత్యేక అధికారిగా రమేష్

image

ప్రభుత్వ పాఠశాలల్లో కార్యక్రమాల అమలును పర్యవేక్షించేందుకు సంగారెడ్డి జిల్లా ప్రత్యేక అధికారిగా ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ రమేష్ నియమితులయ్యారు. ఈ నెల 17 నుంచి 22 వరకు 10 మండలాల్లోని 10 పాఠశాలల్లో ‘5.0’ కార్యక్రమాల అమలును ఆయన పరిశీలిస్తారని DEO వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ తనిఖీలకు సిద్ధంగా ఉండాలని ప్రధానోపాధ్యాయులకు ఆయన సూచించారు. తనిఖీల అనంతరం రమేష్ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారని పేర్కొన్నారు.