News November 16, 2025
KMR: 3.19 మీటర్ల పైకి భూగర్భ జలాలు

కామారెడ్డి జిల్లాలో భూగర్భ జలాల స్థాయి గణనీయంగా పెరిగినట్లు జిల్లా భూగర్భ జల అధికారి సతీష్ తెలిపారు. గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ ఏడాది నీటి మట్టం ఏకంగా 3.19 మీటర్లు పెరిగిందని Way2Newsతో చెప్పారు. ఈసారి వర్షపాతం 1,402.7 మి.మీ. వర్షపాతం నమోదయ్యిందని.. ఏకంగా 58.4% అధిక వర్షపాతం పడిందన్నారు. జిల్లాలో అన్ని చెరువులు, కుంటల్లో నీళ్లు ఉండడంతో రబీ పంటలకు సాగుకు ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు.
Similar News
News March 17, 2026
‘ఇజ్రాయెల్ ఒత్తిడి వల్లే యుద్ధం’.. అమెరికా ఉన్నతాధికారి రాజీనామా

ఇరాన్‌తో యుద్ధం వేళ అమెరికా నేషనల్ కౌంటర్‌టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ జో కెంట్.. ట్రంప్‌కు షాకిచ్చారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘ఇరాన్‌తో అమెరికా యుద్ధం చేయడం నాకు ఇష్టం లేదు. మన దేశానికి ఇప్పటికిప్పుడు ఇరాన్‌తో ఎలాంటి ముప్పు వచ్చే అవకాశం లేదు. కానీ ఇజ్రాయెల్, బలమైన అమెరికన్ లాబీ ఒత్తిడి వల్లే అమెరికా యుద్ధంలోకి దిగినట్లు స్పష్టం అవుతోంది’ అని పేర్కొన్నారు.
News March 17, 2026
సంగారెడ్డి: డిజిటల్ హెల్త్ కార్డులపై కలెక్టర్ యాక్షన్ ప్లాన్

సంగారెడ్డి జిల్లాలో డిజిటల్ హెల్త్ కార్డుల అమలుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారం డిజిటలైజ్ కావాలని సూచించారు. అదనపు కలెక్టర్ పాండు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంత రావు తదితరులు పాల్గొన్నారు.
News March 17, 2026
కడప: రేపటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం

కడప జిల్లాలోని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థ పాలకవర్గ సభ్యుల పదవీకాలం మంగళవారంతో ముగిసింది. బుధవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలనలో నగరపాలక సంస్థ, మున్సిపాలిటీలు కొనసాగనున్నాయి. కడప నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా జిల్లా జేసీ నిధి మీనా బాధ్యతలు చేపట్టనున్నారు.


