News November 16, 2025
భద్రాద్రి: బస్సుల్లో రద్దీ.. ప్రయాణికుల ఇబ్బందులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహాలక్ష్మీ ఉచిత బస్సు సౌకర్యం అమలయ్యాక, బస్సుల్లో అధిక రద్దీ వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, బాలింతలు, చిన్నపిల్లలు RTC బస్సుల్లో సురక్షితంగా ప్రయాణించలేని పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కూడా తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారు. మరిన్ని సర్వీసులు పెంచాలని జిల్లా ప్రజలు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు.
Similar News
News March 6, 2026
NGKL: తగ్గనున్న హైదరాబాద్-తిరుపతి ప్రయాణం.. అటవీశాఖ గ్రీన్‌సిగ్నల్

కృష్ణానదిపై సోమశిల వద్ద నిర్మించబోయే ఐకానిక్ వంతెన నిర్మాణానికి మార్గం సుగమమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు కోసం 24.66 హెక్టార్ల అటవీ భూమిని మళ్లించేందుకు కేంద్ర మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. AP-TG రాష్ట్రాల మధ్య అనుసంధానకర్తగా నిలిచే ఈ వంతెన నిర్మాణం కోసం కేంద్రం వెయ్యి కోట్లకుపైగా నిధులను కేటాయించనుంది. ఈ ప్రాజెక్టు సాకారమైతే HYD-తిరుపతి మధ్యదూరం 80 కిమీ తగ్గనుంది.
News March 6, 2026
BREAKING: తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ కూడా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.770 తగ్గి రూ.1,62,110కు చేరింది. ఐదు రోజుల్లోనే రూ.10,980 తగ్గడం విశేషం. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.700 పతనమై రూ.1,48,600గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలుండొచ్చు.
News March 6, 2026
VZM: అందొచ్చిన కొడుకు అకాలమరణం

విజయనగరం జిల్లాలో తెల్లవారుజామున జరిగిన <<19308463>>రోడ్డు ప్రమాదం<<>>లో యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడు దత్తిరాజేరు (M) పెదమానాపురం గ్రామానికి చెందిన రౌతు నానిగా గుర్తించారు. నాని, రౌతు సాయి, గెద్ద శేఖర్, సాయి స్నేహితుడు ప్రయాణిస్తున్న కారు గజపతినగరం (M) మరుపల్లి వద్ద అదుపుతప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. అందొచ్చిన కొడుకు అకాలమరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.


