News November 16, 2025
రేపు నూజివీడులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

నూజివీడు పట్టణ పరిధిలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో రేపు ఉదయం 10 గంటలకు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. సబ్ కలెక్టర్ వినూత్న ఆదివారం మాట్లాడుతూ..రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చు అన్నారు. ప్రతి అర్జీ ఆన్లైన్ చేయడం, నిర్ణీత వ్యవధిలో సమస్యలు పరిష్కరిస్తామన్నారు.
Similar News
News March 12, 2026
కోరుట్ల: ‘ప్రజల నమ్మకాన్ని అభివృద్ధి రూపంలో చూపాలి’

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమ హక్కులు, బాధ్యతలను తెలుసుకుని ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలని అన్నారు. ప్రజల నమ్మకాన్ని అభివృద్ధి రూపంలో చూపించాలన్నారు.
News March 12, 2026
మంథని జేఎన్‌టీయూలో నూతన ఆడిటోరియం ప్రారంభం

మంథని జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాల బ్లాక్-2లో నూతనంగా నిర్మించిన ఆడిటోరియంను బుధవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన టీసీఎస్ ఒప్పందం మేరకు ఉద్యోగాలకు ఎంపికైన 100 మంది విద్యార్థులకు నియామక పత్రాలు అందజేశారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెడల్స్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు
News March 12, 2026
గ్యాస్ కొరత.. రాష్ట్రంలోని హోటళ్ల కీలక నిర్ణయం

కమర్షియల్ గ్యాస్ కొరత, నిర్వహణ ఖర్చులపై AP హోటల్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈమేరకు విజయవాడలో అత్యవసరంగా సమావేశమైంది. గ్యాస్ ఇబ్బందుల దృష్ట్యా స్టార్ హోటళ్లలో స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ ఆర్డర్లను త్వరలోనే నిలిపివేస్తామని పేర్కొంది. ప్రతి సోమవారం రెస్టారెంట్లు క్లోజ్ చేయాలని నిర్ణయించింది. కర్ణాటక తరహాలో కొన్ని హోటల్స్ కేవలం టీ, కాఫీలు మాత్రమే విక్రయించే పరిస్థితి రాబోతోందని తెలిపింది.


