News November 16, 2025
గురక గాఢనిద్రకు సంకేతం కాదు: వైద్యులు

చాలా మంది గురకను గాఢనిద్రకు సంకేతంగా భావిస్తారు. కానీ అందులో నిజం లేదంటున్నారు వైద్యులు. ‘గురక అనేది గొంతులో గాలి వెళ్లే దారి ఇరుకై శ్వాసకు అడ్డంకులు ఏర్పడటం వల్ల వస్తుంది. దీని వలన నిద్రలో అంతరాయం ఏర్పడి గాఢనిద్ర పట్టదు. తరచుగా గురక వస్తున్నట్లయితే అది స్లీప్ అప్నియా వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు’ అని చెబుతున్నారు. మీ ఇంట్లో ఎవరైనా ఎక్కువగా గురక పెడితే వైద్యుడిని సంప్రదించండి.
Similar News
News March 11, 2026
జాగ్రత్త.. 3 రోజులు భగభగలు

నేటి నుంచి ఈ నెల 14 వరకు మూడు రోజుల పాటు తెలంగాణలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతాయని వాతావరణ నిపుణులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో 37-38 డిగ్రీలు, తూర్పు, ఉత్తర తెలంగాణలో 39-40 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మధ్యాహ్నం పూట ప్రయాణాలు మానుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
News March 11, 2026
ఎల్లుండి రైతుల ఖాతాల్లోకి రూ.6,000

AP: పీఎం కిసాన్ పథకంతో కలిపి అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కృష్ణా జిల్లా గన్నవరంలో ఈ నెల 13న సీఎం చంద్రబాబు 46.80 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,808 కోట్లు జమ చేయనున్నారు. పీఎం కిసాన్ కింద రూ.2వేలు, అన్నదాత సుఖీభవ కింద రూ.4వేలు కలిపి మొత్తం రూ.6వేలు డిపాజిట్ కానున్నాయి. ఇప్పటికే రెండు విడతలుగా ప్రభుత్వం రూ.6,309 కోట్లను రైతు కుటుంబాలకు పంపిణీ చేసింది.
News March 11, 2026
ఓవైపు ఎండ.. మరోవైపు వర్షం!

AP: రాష్ట్రంలో నేటి నుంచి ఎండ తీవ్రత స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు పడతాయని పేర్కొంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో నిన్న అక్కడక్కడా జల్లులు కురిశాయి. పాక్షికంగా మేఘాలు ఆవరించడంతో పగటి ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల 2-3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. గరిష్ఠంగా నంద్యాలలో 36.2 డిగ్రీలు నమోదైంది.


