News November 16, 2025

తిరుపతి: విద్యుత్ సమస్యలు ఉంటే కాల్ చేయండి.!

image

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ CMD కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు CMD శివశంకర్ తెలిపారు. సోమవారం ఉదయం 10-12 మధ్య కార్యక్రమం ఉంటుందన్నారు. రాయలసీమ జిల్లాల ప్రజలు సమస్యలు ఉంటే 8977716661కు కాల్ చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. వీటితోపాటు 1912, వాట్సాప్ నం. 91333 31912 ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు.

Similar News

News March 12, 2026

రాజమండ్రి కల్తీ పాల ఘటన.. 13కు చేరిన మృతుల సంఖ్య!

image

రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ విషాద ఘటనలో బుధవారం రెండేళ్ల బాలుడు <<19354442>>జై క్రిత్ రాజ్<<>> మరణించగా.. గురువారం తెల్లవారుజామున బండారు వీరలక్ష్మి(60) ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. వైద్య ఆరోగ్యశాఖ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఇప్పటివరకు ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. కాగా ఏడుగురు బాధితులు వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు.

News March 12, 2026

ఖమ్మం: విద్యుత్ ఫిర్యాదులకు ‘వాట్సాప్’ పరిష్కారం

image

విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం వినియోగదారులు ఇక కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. NPDCL ప్రత్యేకంగా వాట్సాప్ చాట్ బాట్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. 79016 28348 నంబర్‌కు Hi అని సందేశం పంపి, మీ సర్వీస్ నంబర్ ద్వారా ఇంట్లోనే ఉండి ఫిర్యాదు చేయవచ్చు. సమస్య పరిష్కారమయ్యాక IVRS ద్వారా నిర్ధారణ చేసుకునే పారదర్శక విధానం కల్పించారు. అత్యవసరసమయాల్లో 1912కు కాల్ చేయాలని ఎస్ఈ శ్రీనివాసాచారి సూచించారు.

News March 12, 2026

X యూజర్లకు షాక్

image

ఇక నుంచి X (ట్విటర్)లో గ్రోక్‌ను ప్రశ్నలు అడగలేం. కేవలం ప్రీమియం, ప్రీమియం+ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే ఆ ఫీచర్ అందుబాటులో ఉందని X ప్రకటించింది. ప్రీమియం కోసం నెలకు రూ.230, ప్రీమియం+ కోసం నెలకు రూ.1,285 చెల్లించాలి. కాగా Xలో పోస్టులపై ఏమైనా సందేహాలు ఉంటే నెటిజన్లు గ్రోక్‌ను అడిగి వాటిని నిర్ధారించుకునేవారు.