News November 16, 2025

మేడారంలో అభివృద్ధి పనుల పరిశీలన: మంత్రి సీతక్క

image

మేడారంలో మాస్టర్ ప్లాన్ మేరకు జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్ తదితరులతో కలిసి ఆదివారం పరిశీలించారు. జంపన్న వాగు వద్ద భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వాగు మెట్లను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. భద్రతా చర్యల్లో భాగంగా జంపన్న వాగు వంతెనపై జాలి (రక్షణ కంచె) ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

Similar News

News November 16, 2025

WGL: ప్రత్యేక లోక్‌ అదాలత్‌లో 5,025 కేసుల పరిష్కారం: సీపీ

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక లోక్‌ అదాలత్‌కు విశేష స్పందన లభించింది. ఈ అదాలత్ ద్వారా 5,025 కేసులను పరిష్కరించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. సైబర్ క్రైమ్ కేసుల్లో రూ.89 లక్షలకు పైగా రిఫండ్ మొత్తాన్ని బాధితులకు అందజేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News November 16, 2025

ఎర్రకోట ఆత్మాహుతి దాడి.. కీలక నిందితుడు అరెస్ట్

image

ఢిల్లీ ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడి కేసులో కీలక పురోగతి సాధించినట్లు NIA ప్రకటించింది. ఈ దాడికి సూసైడ్ బాంబర్ ఉమర్ నబీతో కలిసి కుట్ర చేసిన కశ్మీర్ వాసి అమీర్ రషీద్ అలీని అరెస్టు చేసినట్లు తెలిపింది. కారును కొనుగోలు చేసి, అందులో IED అమర్చేందుకే ఇతను ఢిల్లీకి వచ్చినట్లు పేర్కొంది. ఈనెల 10న జరిగిన ఆత్మాహుతి దాడిలో 10 మంది మరణించగా, 32 మంది గాయపడిన విషయం తెలిసిందే.

News November 16, 2025

రేపు కార్తీక మాసం చివరి సోమవారం.. ఏం చేయాలంటే?

image

కార్తీక మాసం చివరి సోమవారం శివుడిని పూజిస్తే ఆయన అనుగ్రహం పొందవచ్చని పండితులు చెబుతున్నారు. ‘ఉదయాన్నే స్నానం చేయాలి. శివాలయానికి వెళ్లి బిల్వ పత్రాలు సమర్పించాలి. నీళ్లు/పాలు, పెరుగు, తేనె, గంగాజలంతో అభిషేకం చేయించాలి. 365 వత్తులతో దీపాలు వెలిగించాలి. ఉపవాసం ఉండి అన్నదానం, వస్త్రదానం చేయాలి. ఆవుకు ఆహారం పెట్టాలి. దీనివల్ల ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది’ అని పేర్కొంటున్నారు.