News April 12, 2024

‘వాలంటీర్’ వ్యవస్థపై సినిమా

image

AP: సీఎం జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థపై సినిమా తెరకెక్కుతోంది. సూర్యకిరణ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా.. ప్రసిద్ధి దర్శకత్వం వహిస్తున్నారు. రాకేశ్ రెడ్డి సినిమాను నిర్మిస్తున్నారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తిరుపతిలో ఈ సినిమా టైటిల్‌ను ఇవాళ లాంఛ్ చేశారు. వాలంటీర్లు రియల్ హీరోలని, ఈ గొప్ప వ్యవస్థపై సినిమా రావడం సంతోషకరమని నారాయణ స్వామి పేర్కొన్నారు.

Similar News

News March 24, 2026

యుద్ధం.. అమెరికాతో జైశంకర్ చర్చలు

image

అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ రూబియోతో విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్‌లో మాట్లాడారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావంపై చర్చించారు. ముఖ్యంగా హార్ముజ్ వివాదం నేపథ్యంలో ఇంధన భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధాన్ని ఐదు రోజులు వాయిదా వేసినట్లు ట్రంప్ ప్రకటించిన కాసేపటికే ఈ చర్చలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2 దేశాలు నిరంతరం టచ్‌లో ఉండాలని నిర్ణయించాయి.

News March 24, 2026

ట్రంప్ ప్రకటనతో దిగొచ్చిన చమురు ధరలు

image

ఇరాన్‌పై దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో యుద్ధ భయాలు తగ్గాయి. దీంతో చమురు ధరలు 13% మేర దిగొచ్చి $95 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు సోమవారం ఉదయం భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు సాయంత్రానికి మళ్లీ పుంజుకున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో తులం బంగారం ₹1.46 లక్షల వరకు చేరింది. ఈ సానుకూల పవనాలతో మంగళవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

News March 24, 2026

స్మార్ట్‌ఫోన్ అతిగా చూస్తే ఈటింగ్ డిజార్డర్స్

image

స్మార్ట్‌ఫోన్ అతిగా వాడటం వల్ల కేవలం కంటి సమస్యలే కాకుండా ‘ఈటింగ్ డిజార్డర్స్’ కూడా వస్తాయని తాజా పరిశోధనలో తేలింది. ముఖ్యంగా రోజుకు 7 గంటల కంటే ఎక్కువ సమయం ఫోన్‌తో గడిపే యూత్‌లో ఈ ముప్పు ఎక్కువగా ఉంది. ఆన్‌లైన్‌లో కనిపించే ఐడియల్ బాడీ షేప్‌తొ తమను పోల్చుకోవడం వల్ల మెంటల్ టెన్షన్‌కు లోనై అదుపు లేకుండా తినడం లేదా అసలు తినకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని తేలింది.