News November 16, 2025
సామాజిక ఐక్యతే అభివృద్ధికి మూలం: మంత్రి పొంగులేటి

ఖమ్మం: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదివారం ఉమ్మడి జిల్లాలోని సత్తుపల్లి, కొత్తగూడెం ప్రాంతాల్లో పలు సామాజిక వర్గాలు నిర్వహించిన కార్తీక వన సమారాధనల్లో పాల్గొన్నారు. సత్తుపల్లిలోని రెడ్డి, ఆర్యవైశ్య సంఘాల వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. సామాజిక ఐక్యతతోనే ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఈ సందర్భంగా పలు సంఘాల సభ్యులు మంత్రిని సన్మానించారు.
Similar News
News November 16, 2025
250 ఉద్యోగాలకు నోటిఫికేషన్

కేంద్ర క్యాబినెట్ సెక్రటేరియట్‌లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 250 గ్రూప్-B పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ వెలువడింది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు గేట్ 2023/24/25 స్కోర్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వయసు 30 ఏళ్లు మించరాదు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం రూ.99,000 వరకు ఉంటుంది. పూర్తిస్థాయి నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.
వెబ్‌సైట్: https://cabsec.gov.in/
News November 16, 2025
ఇంటి వస్తువులను పాదబాటలపై పెట్టవచ్చా?

జనరేటర్లు, షెడ్లను పాదబాటలపై ఏర్పాటు చేయడం వాస్తు విరుద్ధమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. వాన, ఎండ నుంచి రక్షణ కోసం పాదబాటలపై షెడ్ వేసినా, అది ప్రజల హక్కును ఉల్లంఘించడమే అవుతుందన్నారు. ‘ఇంటికి చెందిన ప్రతి వస్తువు, నిర్మాణం ఇంటి ప్రాంగణంలోనే ఉండాలి. వీధులను ఆక్రమిస్తే వాస్తు శక్తికి ఆటంకం కలుగుతుంది. ఎవరి పరిధిలో వారు ఉంటేనే వాస్తు ఫలితాలు పూర్తిగా లభిస్తాయి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News November 16, 2025
WGL: ప్రత్యేక లోక్ అదాలత్‌లో 5,025 కేసుల పరిష్కారం: సీపీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించింది. ఈ అదాలత్ ద్వారా 5,025 కేసులను పరిష్కరించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. సైబర్ క్రైమ్ కేసుల్లో రూ.89 లక్షలకు పైగా రిఫండ్ మొత్తాన్ని బాధితులకు అందజేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


